ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 15 అక్టోబర్ 2020
ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 15 అక్టోబర్ 2020 వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 మేషరాశి ( Aries) వారికి: ఈ రోజు సామాజిక , ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి పనులు కుటుంబ గౌరవాన్ని పెంచుతుంది. మీరు మీ నిర్ణయంతో ప్రయోజనాలు అందుకుంటారు. మీ ఆసక్తి , త్యాగం ఎక్కువగా ఉంటుంది. వయస్సు మళ్ళిన వారికి సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సాధారణ రుగ్మతలు మిమ్మల్ని బాధపెడతారు. పశు , పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. వృషభరాశి ( Taurus) వారికి: ఈ రోజు మీరు సంతానం నుంచి ఉత్తమ ప్రవర్తనతో విజయం అందుకుంటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇంటి నుంచి బయటకు రావడం మీకు కొంత ప్రత్యేక ప్రయోజనం పొందుతారు. ప్రాపంచీక ఆనందాలు విస్తరిస్తాయి. నూతన ఆదాయ మార్గాలు సృష్టించుకుంటారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆధ్యాత్మిక పనుల్లో బిజీగా గడుపుతారు. మంచి పనుల కోసం ఖర్చు చేస్తారు...