Posts

Showing posts with the label buddudu

హుస్సేన్ సాగర్‌లోని బుద్దుడి విగ్రహం ఠీవికి వన్నె తెచ్చే...!

Image
  చారిత్రాత్మక హైదరాబాద్ నగరంలో మరో అద్భుతం సాక్షాత్కారం కానుంది. హుస్సేన్ సాగర్‌లోని బుద్దుడి విగ్రహం ఠీవికి వన్నె తెచ్చే కట్టడం నిర్మితం కానుంది.   హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ చుట్టూ విస్తరించిన నగరంలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, మరెన్నో అద్భుత నిర్మాణాలు. నగరాన్ని అనునిత్యం పరిశీలిస్తున్నట్టుగా కన్పించే ప్రశాంతమైన బుద్దుడి విగ్రహం. ఇటీవలి కాలంలో నిర్మితమవుతున్న కొత్త కొత్త కట్టడాలు హైదరాబాద్ నగరానికి మరిన్ని సొగసులు అద్దుతున్నాయి. పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మరో అద్భుత కట్టడం త్వరలో నిర్మాణం కానుంది. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ అందాన్ని పెంచే సుందర నిర్మా ణానికి అంకురార్పణ జరిగింది.   హుస్సేన్ సాగర్‌పై కొంతవరకూ నడిచి వెళ్లి...నది అందాన్ని పై నుంచి వీక్షించేలా..బుద్ధుడి ఠీవిని మరింత చేరువగా చూసేలా అద్భుతమైన వాక్ వే నిర్మితం కానుంది. జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ స్వయంగా ఈ విషయాన్ని ట్విట్ చేశారు. ఈ నిర్మాణం ప్రజలకు కచ్చితంగా ఓ మంచి అనుభూతిని ఇవ్వనుంది. నెక్లెస్ రోడ్డులోని పీవీ నరశింహారావు మార్గ్ వద్ద...