బతుకమ్మ పండుగలో రోజుకొక్కో రకమైన ప్రత్యేక నైవేద్యం...!
బతుకమ్మ పండుగలో రోజుకొక్కో రకమైన ప్రత్యేక నైవేద్యం...! వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151 తెలంగాణలో బతుకమ్మ పండుగకు ప్రసిద్ధమైంది. అమావాస్య నాడు ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలు , నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కోక రకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని , చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ సంవత్సరం అధిక ఆశ్వీయుజ మాసం రావడం వలన ఈ పండగను నిజ ఆశ్వీయుజ మాసం ప్రారంభంతో ...