ఈ రోజు మీ రాశి ఫలాలు: శనివారం 3 అక్టోబర్ 2020
ఈ రోజు మీ రాశి ఫలాలు: శనివారం 3 అక్టోబర్ 2020 మేషరాశి (Aries) వారికి: ఈ రోజు సమాజంలో మీకు పేరు, ప్రతిష్ఠలతో పాటు కీర్తి పెరుగుతుంది. శత్రువులు మీకోసం కుట్రలు పన్నుతారు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. కుటుంబంతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. విద్యార్థులు కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు. కుటుంబంలో వివాదాలు, గొడవలకు దూరంగా ఉండండి. మీ పనిపై మాత్రమే దృష్టి పెడితే మంచిది. ప్రమాదాకర పెట్టుబడులను నివారించండి. విజయం కోసం విద్యార్థులు ఏకాగ్రతను పాటించాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. వృషభరాశి (Taurus) వారికి: ఈ రోజు వ్యాపారస్థులకు ఈ సమయం చాలా ఉత్తమ. నూతన సాంకేతిక వల్ల వ్యాపారం లాభిస్తుంది. తండ్రితో సంబంధాలు బలపడతాయి. పెట్టుబడుల్లో లాభాలు అందుకుంటారు. ఆస్తి పెరుగుతుంది. అదనపు పనిని కేటాయించవచ్చు. ఉద్యోగస్థులను నూతన బాధ్యతలు వస్తాయి. కుటుంబంలో ముఖ్యమైన పని చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీరు నూతన విషయాలను నేర్చుకోవడం కోసం ప్రయత్నించవచ్చు. ఇందులో మీకు విజయం వరిస్తుంది. అంతేకాకుండా గౌరవమర్యాదలు కూడా పొందుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను...