Posts

Showing posts with the label temple

అంతర్వేది ఘటనలో ట్విస్ట్: సీనియర్ ఐఎఎస్ అధికారిపై బదిలీ వేటు

Image
అంతర్వేది ఘటనలో ట్విస్ట్: సీనియర్ ఐఎఎస్ అధికారిపై బదిలీ వేటు తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలంలోని అంతర్వేదిలో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథం మంటల బారిన పడిన ఘటన సరికొత్త మలుపు తిరిగింది. దీనిపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఘాటు విమర్శలతో చెలరేగిపోతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ అసంతృప్తి గళం వినిపిస్తోంది. ఈ వ్యతిరేకతను చల్లార్చడానికి ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలేవీ పెద్దగా ఫలించినట్లు కనిపించట్లేదు.   ఈ పరిణామాల మధ్య ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.   సీనియర్ ఐఎఎస్ అధికారిపై బదిలీ వేటు వేసింది. అంతర్వేది దేవాస్థానం కార్యనిర్వహణాధికారినీ విధుల నుంచి తప్పించింది. ప్రాధాన్యత లేని విభాగానికి పంపించింది. రెవెన్యూ (దేవాదాయం) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ ఉత్తర్వులను జారీ చేశారు.   దేవాదాయ శాఖ ప్ర

ఆలయ ప్రాకారాల్లోని సాలహారాల్లో విగ్రహాలు ఏర్పాటు

Image
  ఆలయ ప్రాకారాల్లోని సాలహారాల్లో విగ్రహాలు ఏర్పాటు   అద్భుతంగా పునర్నిర్మితమవుతున్న యాదాద్రి ప్రధాన ఆలయ ప్రాకారాల్లోని సాలహారాల్లో విగ్రహాల ఏర్పాటు పనులు మంగళవారం ప్రారంభించారు. ఆలయానికి తూర్పున ప్రాకార ద్వారంపై ఏర్పాటు చేసే శంకు , చక్ర , నామాల విగ్రహాలకు ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి , ప్రధాన స్థపతి ఆనందచార్యుల వేలు , ఉప స్థపతి గణేశ్‌ , ఇతర స్థపతులు పూజలు చేశారు. అనంతరం సాలహారాల్లో విగ్రహాల ఏర్పాటు పనులు ప్రారంభించారు.   అలాగే ఆలయానికి నలు దిక్కులా గరుడ , సింహాల విగ్రహాల ఏర్పాటు పనులు కూడా మొదలు పెట్టారు. వీటి ఏర్పాటు మూడు రోజుల్లో పూర్తవుతుందని ఆర్కిటెక్‌ ్టఆనందసాయి తెలిపారు. అలాగే శివాలయంలో నంది విగ్రహానికి ఆనందసాయి పూజలు చేసి విగ్రహా ఏర్పాటు పనులు ప్రారంభించారు.   కాగా సాలహారాల్లో విగ్రహాల ఏర్పాటుకు సంబందించి సోమవారం చినజీయర్‌ స్వామి సూచనలు , సలహాలు తీసుకున్న విషయం తెలిసిందే. మంగళవారమే వీటి ఏర్పాటు పనులు ప్రారంభించారు.