Posts

Showing posts with the label china

యుద్ధభేరి మోగించినట్టు సంకేతాలు…! | China started war on Taiwan

Image
యుద్ధభేరి మోగించినట్టు సంకేతాలు …! తైవాన్‌పై సైనిక చర్యకు చైనా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సరిహద్దులకు భారీ స్థాయిలో బలగాలను, ఆయుధాలను తరలించినట్లు సమాచారం. చైనా ప్రభుత్వం అత్యాధునిక డీఎఫ్-17 క్షిపణులను కూడా మోహరించింది. తైవాన్ తమ అంతర్భాగమేనని చెబుతున్న చైనా, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆ చిన్న భూభాగంపై యుద్ధభేరి మోగించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. మరింత కవ్వించే రీతిలో ఇటీవలే చైనాకు చెందిన 40 యుద్ధ విమనాలు తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. ఇటీవల గ్వాన్‌డాంగ్‌లోని సైనిక స్థావరాన్ని సందర్శించిన అధ్యక్షుడు జిన్‌పింగ్‌.. సైనికులంతా తమ దృష్టిని యుద్ధ సన్నద్దతపైనే ఉంచాలని పిలుపునిచ్చారు. నిత్యం అప్రమ్తతంగా ఉండాలని ఆదేశించారు. సైనిక స్థావరాల విస్తరణ ,  జిన్‌పింగ్‌ ప్రకటన బట్టి చూస్తే తైవాన్‌పై చైనా దాడి చేసేందుకు సిద్ధమవుతోందన్న ఊహాగానాలకు బలం చేకూరుతుంది. చైనాతో యుద్ధానికి తైవాన్ సిద్ధంగా ఉండాలని అమెరికా రక్షణ వర్గాలు సూచించాయి. అయితే తైవాన్‌పై దాడి చేయడం చైనాకు అంత సులభమేమీ కాదని ,  చైనా తన సేనలను తైవాన్‌పైకి నడిపే ముందు ఓసారి అమెరికా వైఖరిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంద

లద్దాఖ్‌ను కలిపే మరో సొరంగం రెడీ అవుతోంది...!

Image
లద్దాఖ్‌ను కలిపే మరో సొరంగం రెడీ అవుతోంది... ! హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి లద్దాఖ్‌కు ఏడాది పొడవునా ప్రయాణించేందుకు వీలుగా ఈ మధ్యనే అటల్‌ టన్నెల్‌ పూర్తయింది. రెండు ప్రాంతాల ప్రజల దశాబ్దాల నాటి కల నెరవేరింది. అయితే ఇప్పుడు అలాంటి మరో టన్నెల్‌నే నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దానిపేరే జోజిలా పాస్‌ టన్నెల్‌. శ్రనగర్‌ నుంచి లద్దాఖ్‌ వరకు ఈ సొరంగం నిర్మాణం జరగనుంది. దీని నిర్మాణం కోసం కూడా ఎన్నో ఏళ్లుగా స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ అనేక కారణాలతో దీని నిర్మాణం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు గురువారం ఈ టన్నెల్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.   జోజిలా పాస్‌ టన్నెల్‌ ద్వారా శ్రీనగర్‌-లద్దాఖ్‌ల మధ్య సంవత్సరం పొడవునా వాహనాల రాకపోకలకు అవకాశం ఏర్పడుతుంది.   అంతేకాకుండా వ్యాపార లావాదేవీలు జరిపేందుకు , కూలి పనులు చేసుకునేందుకు ఈ మార్గం ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే అటల్‌ టన్నెల్‌ నిర్మాణం తరువాత కేంద్రం జోజిలా టన్నెల్‌పై దృష్టి సారించింది. రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ టన్నెల్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. స్వయంగా మొదటి బ్లాస్టింగ్‌

చైనాతో మరోమారు యుద్ధం తప్పదా…!

Image
చైనాతో మరోమారు యుద్ధం తప్పదా …!   సరిహద్దు సమస్య చర్చల ద్వారా పరిష్కారం అయ్యే సూచనలు కనుచూపుమేరలో కనిపించని నేపథ్యంలో చైనా భారత్ పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతున్న సూచనలు కనబడుతున్నాయి. అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణులతో సహా భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించి పలు క్షిపణులను భారత్ చైనాతో సరిహద్దుల్లో మోహరించింది. దీనికి ప్రతిగా చైనా కూడా రెండు వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను మోహరించింది. రెండుదేశాల సన్నాహకాలను చూస్తుంటే సమీప భవిష్యత్తులో ఇరుదేశాలూ యుద్దానికి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోందని రక్షణరంగ నిపుణులు పేర్కొంటున్నారు. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా భారత్ , చైనాలు తమ తమ సరిహద్దుల రక్షణ కోసం , ప్రత్యర్థి దేశంపై దాడి కోసం ఆధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నాయి.  2 వేల కి.మీల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను , భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను జిన్‌జియాంగ్ , టిబెట్‌ ప్రాంతాల్లో చైనా మోహరించింది. ప్రతిగా బ్రహ్మోస్ , నిర్భయ్ , భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల ఆకాశ్‌ క్షిపణులను భారత్‌ సిద్ధం చేసింది.   భారత్ సేకరించిన క్షిపణుల్లో బ్రహ్మో

భారత్‌కు చైనా వైరస్ రూపంలో మరో గండం…!

Image
  భారత్‌కు చైనా వైరస్ రూపంలో మరో గండం …! భారత్‌కు చైనా వైరస్ రూపంలో మరో గండం పొంచి ఉంది. ఇప్పటికే కరోనాతో యావత్ ప్రపంచం వణికిపోతుంటే.. తాజాగా మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. వూహాన్‌ కేంద్రంగా ' క్యాట్ క్యూ ' అనే వ్యాధిని వైద్య అధికారులు గుర్తించారు. దీని కారణంగా మన దేశానికి కూడా ప్రమాదం పొంచి ఉందని ఐసీఎంఆర్ హెచ్చరించింది. దోమలు , పందులను వాహకాలుగా చేసుకొని ఇది మనుషులకు వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. మన దేశంలో ఇది ఎంత మందిలో ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.   చైనా , తైవాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనాల్లో ఇటీవల ఈ వైరస్ వెలుగు చూసింది. దీంతో భారత్‌లో కొన్ని శాంపిళ్లను ఐసీఎంఆర్ సేకరించింది. దేశవ్యాప్తంగా 883 సీరం శాంపిళ్లను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో పరీక్షించగా , రెండు నమూనాల్లో క్యాట్‌ క్యూ వైర్‌సను తిప్పికొట్టే ఐజీజీ యాంటీబాడీల జాడను గుర్తించారు.   వీటిలో నేరుగా వైరస్ మాత్రం కనిపించలేదు. దీంతో మరికొంత మంది శాంపిళ్లను పరీక్షించాలని అభిప్రాయపడ్డారు. మలేరియా , డెంగీ , హంటా వ్యాధులు ప్రభలే అవకాశం ఉందన్నారు. కాగా మన దేశంలో క్యూలెక్స్ దోమలు , ప

సరిహద్దులకు భారీగా చైనా బలగాలు...!

Image
  సరిహద్దులకు భారీగా చైనా బలగాలు...! లడఖ్‌ లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఐసి) వద్ద భారతీయ , చైనా దళాల మధ్య ఉద్రిక్తతల మధ్య , చైనా తన సైనికులను ఎల్‌ఐసి సమీపంలో పెద్ద సంఖ్యలో మోహరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం (సెప్టెంబర్ 7), చుషుల్ వద్ద ఉన్న ముఖ్రి ప్రాంతానికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) చొరబాటు ప్రయత్నాలను అడ్డుకోవడంలో భారత సైన్యం విజయవంతమైంది.   అయితే రాబోయే రోజుల్లో చైనా నుండి ఇలాంటి మరిన్ని చర్యలు వచ్చే అవకాశం ఉందని ఆర్మీ పేర్కొంది. సెప్టెంబర్ 1 న , చైనా ఎల్‌ఐసి వద్ద రెచిన్ లా సమీపంలో పిఎల్‌ఎ గ్రౌండ్ ఫోర్స్ చెందిన బెటాలియన్‌ ను చైనా మోహరించింది. అలాగే స్పాంగూర్ సరస్సు సమీపంలో రెండు బెటాలియన్లను కూడా మోహరించింది.   ఇవన్నీ శిక్వాన్ వద్ద ఉన్న 62 కంబైన్డ్ ఆర్మ్స్ బ్రిగేడ్‌లో భాగం అని అధికారులు పేర్కొన్నారు.  

పాకిస్థాన్ తో కలిసి రెండు వైపుల దాడి చేయడానికి చైనా కుట్ర…!

Image
పాకిస్థాన్ తో కలిసి రెండు వైపుల దాడి చేయడానికి చైనా కుట్ర…!