వెళ్లిపోతానంటున్న గంగవ్వ .. అసలేం జరిగింది
బిగ్ బాస్ షో అట్టహాసంగా పప్రారంభమైన విషయం తెలిసిందే . 16 మంది కంటెస్టెంట్స్ లో ఇప్పటికే సూర్యకిరణ్ ఎలిమినేటి అయిపోయాడు. సూర్యకిరణ్ ప్లేస్ లో "ఈ రోజుల్లో" ఫేమ్ సాయి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక బిగ్ బాస్ లో స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటే గంగవ్వ అని తడుముకోకుండా చెప్పొచ్చు. గంగవ్వ అమాయకత్వంతో , కమ్మనైన తెలంగాణ యాసతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యూట్యూబ్ స్టార్ అయిన గంగవ్వకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె వీడియోలకు మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయి. ఇక ఆమె బిగ్ బాస్ కు వెళ్లింది అంటే జనాలు మొత్తం ఆమె వెనుక ఉన్నారు. మొదటి వారంలోనే ఆమె ఎలిమినేషన్ కు నామినేట్ అవ్వడంతో భారీగా ఓట్లు పడ్డట్లుగా సమాచారం. ఇక నేడు విడుదల చేసిన ప్రోమోలో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఒక పడవను హోస్ లో ఉంచి. అందరు అందులోకి ఎక్కి ఆతరవాత ఆ పడవ తీరం చేరిన వెంటనే హారన్ వినిపిస్తుంది . అలా హారన్ వినిపించినప్పుడల్లా ఒకరు దిగిపోవాలని అన్నారు. అలా దిగిన వారు వచ్చే వారం ఎలిమినేషన్ కు నామినేట్ అవుతారని తెలిపాడు బిగ్ బాస్ . ఐతే పడవ దిగేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. గంగవ్వ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ...