Posts

Showing posts from February, 2022

వాస్తు ప్రకారం ఈ దిశవైపు ఎత్తుగా ఉంటే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యం తప్పదట…!

Image
  వాస్తు ప్రకారం ఈ దిశవైపు ఎత్తుగా ఉంటే స్థిరాస్తుల అమ్మకం , అనారోగ్యం తప్పదట…! ఇల్లు నిర్మిస్తున్నాం అనుకోగానే వాస్తు పట్టించుకునేవారంతా ముందుగా గమనించేది దిక్కులు. ఏ దిక్కున ఏం ఉండాలని ముందుగానే ప్లాన్ వేసుకుంటారు. ఎందుకంటే మనకున్న ఎనిమిది దిక్కుల్లో ఒక్కో దిక్కుకి ఒక్కో దేవత అధిపతి. వారు శాంతించేలా ఇంటి నిర్మాణం ఉండేలా చూసుకుంటే అంతా శుభమే. మరి ఏ దిక్కున ఏం నిర్మించాలి , ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. తూర్పు : తూర్పు దిక్కును ఇంద్రుడు పాలిస్తుంటాడు. ఇంద్రుడు సంతానం, ఐశ్వర్యాలను కలిగిస్తాడని ప్రతీతి. అందుకే తూర్పు భాగంలో ఎక్కువ బరువు పెట్టడం మంచిది కాదు. అందుకే ఈ దిక్కున ఖాళీ స్థలంలో బావులు, బోర్లు నిర్మిస్తే శుభం. పడమర : పడమర దిక్కుకు అధిష్టాన దేవత వరుణడు. గృహ నిర్మాణ సమయంలో తూర్పు వైపు కన్నా పడమటి వైపు తక్కువ స్థలం విడిచిపెట్టాలి, ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఈ భాగంలో కూడా మంచినీటి బావులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్తరం : ఈ దిక్కుకు అధిష్టాన దేవత కుబేరుడు. దక్షిణ దిక్కుకంటే పల్లంగా విశాలంగా ఉండేలా చూసుకోవాలి. ఈ దిక్కున కూడా బోరు తవ్వించవచ్చు.ఈ జాగ్రత్తలు తీసుకుంటే విద్య, ఆదాయం...

తెల్ల వెంట్రుకలను పీకేస్తే. అవి రెట్టింపు అవుతాయంటారు.. ఇది వాస్తవమేనా…?

Image
  తెల్ల వెంట్రుకలను పీకేస్తే, అవి రెట్టింపు అవుతాయంటారు. ఇది వాస్తవమేనా… ?   తెల్లవెంట్రుకలు వస్తున్నాయంటే పెళ్లి కానీ యువతకు భయం ఉంటుంది. పెళ్లి కూడా కాలేదు , అప్పుడే వైయిట్ హెయిర్ వస్తుందని అందరూ ఆటపట్టిస్తూ ఉంటారు. అందుకే వాటిని కవర్ చేయడానికి కలర్ వేయడం , గోరింటాకు పెట్టడం వంటివి చేస్తుంటారు చాలామంది. ఒకప్పుడు వయసు మీదపడితేనే జట్టు నరిసేది. కానీ ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ , ఒత్తిడి , ఇతరత్రా కారణాల వల్ల తక్కువ వయసులోనే వెంట్రుకలు తెల్లబడుతున్నాయి. అయితే జనాల్లో ఒక నమ్మకం బాగా ఉంది . అది ఏంటంటే , తెల్ల వెంట్రుకలను పీకేస్తే ఆ చుట్టూ పక్కల హెయిర్ కూడా తెల్లగా అవుతుందని. చాలామంది వైట్ హెయిర్ పీకేస్తుంటే పక్కన ఉండేవారు ఇదే మాట చెబుతారు. అసలు ఈ విషయం నిజమేనా , దీనిపై నిపుణులు ఏమంటున్నారు .   వెంట్రుకలు తలపై ఉన్న రోమ కుదుళ్ల నుంచి మొలుస్తాయి. ఈ కుదుళ్లు ఎపిడెర్మిస్ అని పిలిచే ఉపరితల చర్మం కింద ఉన్న డెర్మిస్ ప్రాంతంలో ఉంటాయి. అక్కడే మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. వైట్ హెయిర్ కు , నల్లవెంట్రుకలకు మధ్య తేడాను నిర్ణయించేది మెలనిన్. తెల్లవెంట్రుకలలో మెలనిన్ ఉండదు. అదే నల్లవెంట్...

ఇది పుతిన్‌ సైతం ఊహించని పరిణామం, ఉక్రెయిన్‌ చేష్టలు భేష్‌ అంటూ…!

Image
  ఇది పుతిన్‌ సైతం ఊహించని పరిణామం , ఉక్రెయిన్‌ చేష్టలు భేష్‌ అంటూ…! ఉక్రెయిన్‌ పరిణామాలను ప్రపంచం ఒకవైపు ఆసక్తిగా గమనిస్తోంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై పాశ్చాత్య దేశాలు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధానికి తహతహలాడుతున్నాడంటూ తిట్టిపోస్తున్నాయి. ఈ తరుణంలో ఊహించని ప్రశంసలు పుతిన్‌పై పడ్డాయి. చేసింది ఎవరో కాదు , అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఉక్రెయిన్‌ పరిణామాల ఆధారంగా , పుతిన్ మహా మేధావి అంటూ వ్యాఖ్యానించాడు ట్రంప్‌. రైట్‌ వింగ్‌ రేడియో ప్రోగ్రామ్‌, ది క్లే ట్రావిస్ అండ్ బక్ సెక్స్టాన్ షోలో పాల్గొన్న ట్రంప్‌, పుతిన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుతిన్‌ గురించి నాకు బాగా తెలుసు. అతని నాకు మంచి స్నేహితుడు. మహా మేధావి కూడా. ఉక్రెయిన్ లోని డానెట్స్క్, లుహాన్స్క్ లను స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించడం తెలివైన చర్య అంటూ పేర్కొన్నాడు ట్రంప్‌. ''ఉక్రెయిన్ లోని భారీ భూభాగాన్ని స్వతంత్ర రాజ్యాలుగా పుతిన్ ప్రకటించడాన్ని టీవీలో చూశా. వావ్‌, అది అద్భుతమైన చర్య అన్నారు. ఆ నిర్ణయం ఎంత తెలివైనదంటే, రెండు స్వతంత్ర రాజ్యాలుగా విడగొట్టి పుతిన్ శ...

కార్ల్‌సన్‌ను ఓడించిన యువ సంచలనం ప్రజ్ఞానందకు ప్రధాని మోదీ అభినందనలు

Image
  కార్ల్‌సన్‌ను ఓడించిన యువ సంచలనం ప్రజ్ఞానందకు ప్రధాని మోదీ అభినందనలు ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్ చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన భారతదేశానికి చెందిన 16 ఏళ్ల కుర్రాడు ఆర్. ప్రజ్ఞానందను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ట్విట్టర్ వేదికగా ప్రజ్ఞానందకు మోదీ అభినందనలు తెలిపారు. "యువ మేధావి ఆర్ ప్రజ్ఞానంద విజయం పట్ల సంతోషిస్తున్నాను. ప్రముఖ చెస్‌ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌పై విజయం సాధించినందుకు గర్విస్తున్నాను. ప్రతిభావంతుడైన ప్రజ్ఞానందకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను." అని ప్రధాని నరేంద్ర మోదీ రాసుకొచ్చారు. కాగా ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ టోర్నీలోనే ఐదవ అతిపిన్న వయస్కుడైన 16 ఏళ్ల ప్రజ్ఞానానంద ఎనిమిదో రౌండ్‌లో ప్రపంచ చెస్ నంబర్ వన్‌ గ్రాండ్‌మాస్టర్ కార్ల్‌సన్‌ను ఓడించి ఆశ్చర్యపరిచాడు. అయితే వరల్డ్ నంబర్ వన్ కార్ల్‌సన్‌ను ఓడించినప్పటికీ ఈ టోర్నీలో ప్రజ్ఞానంద నాకౌట్ పోరుకు అర్హత సాధించలేకపోయాడు. ఈ ఆన్ ​ లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ​ ను 11వ స్థానంతో ముగించాడు. ఈ టోర్నీలో నాకౌట్‌కు అర్హత సాధించాలంటే తొల...

మహాశివరాత్రి నాడు ఏ రాశివారు ఏమంత్రం జపించాలో తెలుసా...!

Image
  మహాశివరాత్రి నాడు ఏ రాశివారు ఏమంత్రం జపించాలో తెలుసా ...! ఈ ఏడాది మార్చి1వ తేదీ, మంగళవారం వస్తోంది. దేశంలోని హిందువులు మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రధ్ధలతో జరుపుకుంటారు. మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి పర్వదినం భక్తులు లింగరూపంలో ఉన్న శివునికి వివిధ సుగంధ ద్రవ్యాలు , పండ్లరసాలు, వివిధద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తారు. లింగోద్భవ కాలంలో శివ పార్వతుల కళ్యాణం జరుపుతారు. పరమ శివుడ్ని ప్రసన్నం చేసుకోటానికి జ్యోతిష్య శాస్త్రంలో వివిధ మార్గాలు ఉన్నాయని రాజస్థాన్ చిత్తోర్‌ఘడ్ లో ఉన్న కల్లాజీ వేద విశ్వవిద్యాలయం జ్యోతిషశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మృత్యుంజయ్ తివారీ తెలిపారు. మేషాది ద్వాదశ రాశులవారు ఈ క్రింద చెప్పబడిన ఆ రాశికి సూచించిన మంత్రాలతో మహా శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేసుకుంటే శుభం కలుగుతుందని తివారీ తెలిపారు. మేషరాశి : ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివుడిని తమ శక్తికొలదీ పూజించి, "ఓం మమలేశ్వరాయ నమః" అనే మంత్రాన్ని జపిస్తే మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. వృషభం : ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేసి “ఓం నాగేశ్వరాయ నమః” అనే మంత్ర...

రాత పరీక్షలేకుండానే ఎంపికలు, 171 ఉద్యోగాలు, 3 రోజుల్లో ముగుస్తున్న గడువు...!

Image
  రాత పరీక్షలేకుండానే ఎంపికలు , 171 ఉద్యోగాలు , 3 రోజుల్లో ముగుస్తున్న గడువు...! ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన వైద్య , ఆరోగ్య శాఖ ( DCHS) కర్నూలు జిల్లా ( Kurnool District) లో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ , ఖాళీల సంఖ్య , జీతభత్యాలు , ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం. వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య:   171 విభాగాల వారీగా ఖాళీలు: ·          రేడియోగ్రాఫర్: 6 ·          థియేటర్ అసిస్టెంట్: 26 ·          పోస్ట్ మార్టం అసిస్టెంట్: 28 ·          ల్యాబ్ టెక్నీషియన్: 22 ·          ల్యాబ్ అటెండెంట్: 4 ·          డైటీషియన్: 1 ·          కౌన్సిలర్: 3 ·      ...

తెలంగాణలో టెన్త్ క్లాస్ తెలుగు ఎగ్జామ్ సిలబస్ ఇదే…!

Image
  తెలంగాణలో టెన్త్ క్లాస్ తెలుగు ఎగ్జామ్ సిలబస్ ఇదే …!   కోవిడ్ కారణంగా చాలామంది విద్యార్థులు నేరుగా పాఠశాలకు రాలేక పోతున్నాను. కనీసం పాస్ మార్కు లైన రావాలంటే ఏయే అంశాలపై దృష్టి సాధించాలి మరియు 60 శాతం మార్కులు రావాలంటే ఏం చేయాలి ? అవగాహన ప్రతిస్పందనలో భాగంగా ఉపవాచకం పరిచిత గద్యం అడుగుతారు 5×1=5 మా కావున పరిచిత అపరిచిత గద్యాలు విద్యార్థులలో అభ్యాసం చేయించినట్లయితే రెండింటికి 10 కి 10 మార్కులు సాధించవచ్చు. మొత్తం 12 పాఠలలో 3 పాఠాలు తొలగించడం జరిగింది. తొలగించిన పాఠల నుండి స్వీయ రచన ప్రశ్నలు నుండి అడుగుతారు ఇది విద్యార్థులకు చక్కని అవకాశం. విద్యార్థులకు అనుకూలంగా ఉండడానికి సులభమైన ప్రశ్నలు ఇస్తారు ప్రశ్నల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పుస్తకం పరిధి దాటి ప్రశ్నలు అడగరు. పాఠ్య పుస్తకాన్ని పూర్తిగా చదవడం ద్వారా 60 మార్కులు చాలా సులభంగా వస్తాయి. కొంచెం కష్టపడి చదివితే 75 మార్కులకు వరకు కూడా రావచ్చు. పద్య భాగానికి సంబంధించి 1.3.7. వ పాటలు ఉన్నాయి.ఈ మూడు నుండి ఏదైనా ఒక పాఠాన్ని ఎంచుకొని పూర్తిగా చదివితే పదికి పది 10 మార్కులు ఆ ఒక్క పద్యానికి వస్తాయి. తొలగించిన పాఠాల నుండి కూడా భాషాంశా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం తీసుకోవడం వల్ల…!

Image
  ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం తీసుకోవడం వల్ల …! ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దాని ప్రయోజనాలు తెలుసుకోండి. బెల్లంలో పోషకాలు 1- విటమిన్ B1 మరియు B6 2- విటమిన్ సి 3- మెగ్నీషియం 4- ఇనుము 5- పొటాషియం 6- కాల్షియం ఉదయం ఖాళీ కడుపుతో బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు బెల్లం కడుపు వ్యాధుల నుండి ఉపశమనం పొందుతుంది - ప్రజల జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల కారణంగా , కడుపు వ్యాధులు పెరుగుతున్నాయి. ప్రతి వ్యక్తి గ్యాస్ , అసిడిటీ , అజీర్ణం మరియు మలబద్ధకం వంటి కడుపు వ్యాధుల సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో , ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో బెల్లం తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు తగ్గడానికి (బరువు తగ్గించడంలో బెల్లం మేలు చేస్తుంది) - మీరు మీ బరువును తగ్గించుకోవాలనుకుంటే , మీరు ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో బెల్లం తినాలి. ఇందులో పొటాషియం , మెగ్నీషియం , విటమిన్ బి 1, బి 6 మరియు విటమిన్ సి ఉంటాయి. దీన్ని ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు నెమ్మదిగా కరిగిపోతుంది. బెల్లం హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది - బెల్లంలో ...

Powerful Shri Shiva Rudhra Gayatri Mantra Telugu Lyrics | శివ రుద్ర గాయత...

Image