మహాశివరాత్రి నాడు ఏ రాశివారు ఏమంత్రం జపించాలో తెలుసా...!
మహాశివరాత్రి నాడు ఏ రాశివారు ఏమంత్రం జపించాలో తెలుసా...!
ఈ ఏడాది మార్చి1వ తేదీ, మంగళవారం వస్తోంది. దేశంలోని హిందువులు మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రధ్ధలతో జరుపుకుంటారు.మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి పర్వదినం
భక్తులు లింగరూపంలో ఉన్న శివునికి వివిధ సుగంధ ద్రవ్యాలు, పండ్లరసాలు, వివిధద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తారు. లింగోద్భవ కాలంలో శివ పార్వతుల కళ్యాణం జరుపుతారు.
పరమ శివుడ్ని ప్రసన్నం చేసుకోటానికి జ్యోతిష్య శాస్త్రంలో వివిధ మార్గాలు ఉన్నాయని రాజస్థాన్ చిత్తోర్‌ఘడ్ లో ఉన్న కల్లాజీ వేద విశ్వవిద్యాలయం జ్యోతిషశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మృత్యుంజయ్ తివారీ తెలిపారు. మేషాది ద్వాదశ రాశులవారు ఈ క్రింద చెప్పబడిన ఆ రాశికి సూచించిన మంత్రాలతో మహా శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేసుకుంటే శుభం కలుగుతుందని తివారీ తెలిపారు.
మేషరాశి: ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివుడిని తమ శక్తికొలదీ పూజించి, "ఓం మమలేశ్వరాయ నమః" అనే మంత్రాన్ని జపిస్తే మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
వృషభం: ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేసి “ఓం నాగేశ్వరాయ నమః” అనే మంత్రాన్ని పఠిస్తే అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది.
మిథునం: మహాశివరాత్రి రోజున మిథున రాశి వారు గంగాజలంతో శివునికి అభిషేకం చేసి దానితో పాటు “ఓం భూతేశ్వరాయ నమః” అనే మంత్రాన్ని జపించాలి.
కర్కాటకం: ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి పంచామృతంతో అభిషేకం చేసి, మహాదేవుని “ద్వాదశ” నామాన్ని స్మరించుకోవాలి.
సింహం : ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి తేనెతో అభిషేకం చేసి “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని పఠించాలి.
కన్య: మహాశివరాత్రి రోజున ఈ రాశి వారు శివునికి నీళ్లలో పాలు కలిపి అభిషేకం చేసి “శివ చాలీసా” పఠించాలి.
తుల: శివుని ప్రసన్నం చేసుకోవడానికి, ఈ రోజున మహాదేవునికి పెరుగుతో అభిషేకం చేసి “శివాష్టకం” పఠించండి.
వృశ్చిక రాశి : ఈ రాశి వారు శివునికి పాలు, నెయ్యితో అభిషేకం చేసి “ఓం అంగరేశ్వరాయ నమః” అనే మంత్రాన్ని జపించాలి.
ధనుస్సు: మహాశివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేసి “ఓం సోమేశ్వరాయనమః” అనే మంత్రాన్ని పఠిస్తే కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి.
మకరం: మహాశివరాత్రి రోజున మకర రాశి వారు శివునికి చెరుకు రసంతో అభిషేకం చేసి “శివ సహస్రనామం” పారాయణం చేయాలి.
కుంభం: ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి పాలు, పెరుగు, పంచదార, నెయ్యి, తేనెతో అభిషేకం చేసి, దానితో పాటు “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని జపించాలి.
మీనం: శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, మహాశివరాత్రి రోజున, శివునికి కాలానుగుణంగా లభించే పండ్ల రసంతో అభిషేకం చేయండి, దానితో పాటు “ఓం భవేశ్వరాయ నమః” అనే మంత్రాన్ని జపించండి.
Comments