వాస్తు ప్రకారం ఈ దిశవైపు ఎత్తుగా ఉంటే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యం తప్పదట…!

 

వాస్తు ప్రకారం ఈ దిశవైపు ఎత్తుగా ఉంటే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యం తప్పదట…!


ఇల్లు నిర్మిస్తున్నాం అనుకోగానే వాస్తు పట్టించుకునేవారంతా ముందుగా గమనించేది దిక్కులు. ఏ దిక్కున ఏం ఉండాలని ముందుగానే ప్లాన్ వేసుకుంటారు. ఎందుకంటే మనకున్న ఎనిమిది దిక్కుల్లో ఒక్కో దిక్కుకి ఒక్కో దేవత అధిపతి.

వారు శాంతించేలా ఇంటి నిర్మాణం ఉండేలా చూసుకుంటే అంతా శుభమే. మరి ఏ దిక్కున ఏం నిర్మించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

తూర్పు: తూర్పు దిక్కును ఇంద్రుడు పాలిస్తుంటాడు. ఇంద్రుడు సంతానం, ఐశ్వర్యాలను కలిగిస్తాడని ప్రతీతి. అందుకే తూర్పు భాగంలో ఎక్కువ బరువు పెట్టడం మంచిది కాదు. అందుకే ఈ దిక్కున ఖాళీ స్థలంలో బావులు, బోర్లు నిర్మిస్తే శుభం.


పడమర: పడమర దిక్కుకు అధిష్టాన దేవత వరుణడు. గృహ నిర్మాణ సమయంలో తూర్పు వైపు కన్నా పడమటి వైపు తక్కువ స్థలం విడిచిపెట్టాలి, ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఈ భాగంలో కూడా మంచినీటి బావులు ఏర్పాటు చేసుకోవచ్చు.


ఉత్తరం: ఈ దిక్కుకు అధిష్టాన దేవత కుబేరుడు. దక్షిణ దిక్కుకంటే పల్లంగా విశాలంగా ఉండేలా చూసుకోవాలి. ఈ దిక్కున కూడా బోరు తవ్వించవచ్చు.ఈ జాగ్రత్తలు తీసుకుంటే విద్య, ఆదాయం, సంతానం, పలుకుబడి పెరిగే అవకాశం ఉంది.


దక్షిణం: దక్షిణం దిశకు అధిష్టాన దేవత యముడు. ఉత్తరం కన్నా ఈ దిశ వైపు తక్కువ ఖాళీ స్థలం ఉండాలి. దీనివల్ల సంతానం, ఆదాయం అభివృద్ధి చెందుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యాలు బారిన పడక తప్పదు.


ఈశాన్యం: ఈ దిక్కుకు అధిదేవత ఈశ్వరుడు. అన్ని దిక్కుల కన్నా ఈ దిశ విశాలంగా, పల్లంగా( డౌన్) ఉండాలి. అభిషేక ప్రియుడైన ఈశ్వరుడు ప్రాధాన్యత వహించే ఈ దిక్కున నీరు, బావి ఉంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయంటారు. భక్తి, జ్ఞానం, ఉన్నత ఉద్యోగం సమకూరుతుందట.


ఆగ్నేయం: ఈ దిక్కుకు అధి దేవత అగ్నిదేవుడు. ఈ దిక్కున కిచెన్ ఉండాలి. బావులు, గోతులు ఉండడం, ఇతర దిక్కులకంటే లోతు ఉండడం అస్సలు మంచిది కాదు. ఇలా ఉన్న ఇంట్లో వ్యసనాలు, ప్రమాదాలు, అనారోగ్యం, స్థిరాస్తులు కోల్పోవడం లాంటివి వెంటాడుతాయి.


వాయవ్యం: వాయువ్యానికి అధిదేవత వాయువు. ఈ దిక్కు నైరుతి, ఆగ్నేయ దిశలకంటే పల్లంగా ఉండాలి. అలాగే ఈ దిశలోనూ నూతులు, గోతులు ఉండకూడదు. ఇలా ఉంటే పుత్ర సంతానానికి హాని, అభివృద్ధి చెందరు.


నైరుతి: ఈ దిక్కుకు అధిదేవత నివృత్తి అనే రాక్షసుడు. అన్ని దిక్కులకన్నా ఈ దిక్కు తక్కువ ఖాళీగా ఉండి ఎక్కువ ఎత్తు కలిగి ఉండాలి. అలాగే ఈ దిక్కులో ఎక్కువగా బరువు ఉండడం శుభం. ఈ దిక్కులో గోతులు, నూతులు ఉన్నట్లైతే ప్రమాదాలు, దీర్ఘ వ్యాధులు, స్థిరాస్తులు కోల్పోవటం జరుగుతుంది.

IFrame

Comments