రాత పరీక్షలేకుండానే ఎంపికలు, 171 ఉద్యోగాలు, 3 రోజుల్లో ముగుస్తున్న గడువు...!

 


రాత పరీక్షలేకుండానే ఎంపికలు, 171 ఉద్యోగాలు, 3 రోజుల్లో ముగుస్తున్న గడువు...!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన వైద్య, ఆరోగ్య శాఖ (DCHS) కర్నూలు జిల్లా (Kurnool District) లో ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 171

విభాగాల వారీగా ఖాళీలు:

·         రేడియోగ్రాఫర్: 6

·         థియేటర్ అసిస్టెంట్: 26

·         పోస్ట్ మార్టం అసిస్టెంట్: 28

·         ల్యాబ్ టెక్నీషియన్: 22

·         ల్యాబ్ అటెండెంట్: 4

·         డైటీషియన్: 1

·         కౌన్సిలర్: 3

·         ఆడియోమెట్రీషియన్: 1

·         డెంటల్ టెక్నీషియన్: 1

·         ఫిజియోథెరపిస్ట్: 2

·         బయో మెడికల్ ఇంజనీర్: 6

·         జనరల్ డ్యూటీ అటెండెంట్లు: 66

·         ప్లంబర్: 2

·         ఎలక్ట్రీషియన్: 3

వయోపరిమితి: జూలై 7, 2021 నాటికి అభ్యర్ధులు వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 15,000ల నుంచి రూ.52,000 ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, బీఏ/బీఎస్సీ/బీకాం, బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

·         ఓసీ అభ్యర్ధులకు: రూ. 300

·         ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు: రూ. 200

·         వింకలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

అడ్రస్‌: డీసీహెచ్‌ఎస్‌ (ఏపీవీవీపీ), నంద్యాల జిల్లా ఆసుపత్రి, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌.

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 24, 2022.

 

Comments

Popular posts from this blog

హుస్సేన్ సాగర్‌లోని బుద్దుడి విగ్రహం ఠీవికి వన్నె తెచ్చే...!