తెల్ల వెంట్రుకలను పీకేస్తే. అవి రెట్టింపు అవుతాయంటారు.. ఇది వాస్తవమేనా…?

 

తెల్ల వెంట్రుకలను పీకేస్తే, అవి రెట్టింపు అవుతాయంటారు. ఇది వాస్తవమేనా…?

 

తెల్లవెంట్రుకలు వస్తున్నాయంటే పెళ్లి కానీ యువతకు భయం ఉంటుంది. పెళ్లి కూడా కాలేదు, అప్పుడే వైయిట్ హెయిర్ వస్తుందని అందరూ ఆటపట్టిస్తూ ఉంటారు. అందుకే వాటిని కవర్ చేయడానికి కలర్ వేయడం, గోరింటాకు పెట్టడం వంటివి చేస్తుంటారు చాలామంది. ఒకప్పుడు వయసు మీదపడితేనే జట్టు నరిసేది. కానీ ఇప్పుడు మనం తింటున్న ఫుడ్, ఒత్తిడి, ఇతరత్రా కారణాల వల్ల తక్కువ వయసులోనే వెంట్రుకలు తెల్లబడుతున్నాయి. అయితే జనాల్లో ఒక నమ్మకం బాగా ఉంది. అది ఏంటంటే, తెల్ల వెంట్రుకలను పీకేస్తే ఆ చుట్టూ పక్కల హెయిర్ కూడా తెల్లగా అవుతుందని. చాలామంది వైట్ హెయిర్ పీకేస్తుంటే పక్కన ఉండేవారు ఇదే మాట చెబుతారు. అసలు ఈ విషయం నిజమేనా, దీనిపై నిపుణులు ఏమంటున్నారు.

 

వెంట్రుకలు తలపై ఉన్న రోమ కుదుళ్ల నుంచి మొలుస్తాయి. ఈ కుదుళ్లు ఎపిడెర్మిస్ అని పిలిచే ఉపరితల చర్మం కింద ఉన్న డెర్మిస్ ప్రాంతంలో ఉంటాయి. అక్కడే మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. వైట్ హెయిర్ కు, నల్లవెంట్రుకలకు మధ్య తేడాను నిర్ణయించేది మెలనిన్. తెల్లవెంట్రుకలలో మెలనిన్ ఉండదు. అదే నల్లవెంట్రుకలలో మెలనిన్ బాగా ఉంటుంది. గోధుమరంగు వెంట్రుకల్లో కొంతమేర మెలనిన్ ఉంటుంది. డెర్మిస్ ప్రాంతంలో ఉత్పత్తి అయిన మెలనిన్, వెంట్రుక గొట్టాల్లోకి వెళ్లి అక్కడ నిల్వ ఉంటుంది. అలా జరిగితే హెయిర్ నల్లగా మెరుస్తూ ఉంటుంది. అయితే కొన్ని కుదుళ్ల వద్ద మెలనిన్ ఉత్పత్తి చాలా తక్కువ పరిణామంలో ఉంటుంది. మరికొన్ని చోట్ల అస్సలు ఉండదు. తక్కువ మెలనిన్ ఉన్నచోట.. వెంట్రకలు గోధుమరంగులో ఉంటాయి. అస్సలు లేనిచోట వైయిట్ హెయిర్ ఉంటుంది. ఇక ఏజ్ పెరుగుతున్నకొద్ది అందరిలో మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో తెల్లవెంట్రుకల శాతం పెరుగుతుంది. ఒక్క తెల్లవెంట్రుకను పీకేస్తే, ఆ వెంట్రుక చుట్టుపక్కల ఉన్న నల్ల వెంట్రుకలు కూడా తెల్లగా మారిపోతామన్న పూర్తిగా అపోహ అని కొట్టిపారేస్తున్నారు వైద్య నిపుణులు. తలపై ఒకే ప్రాంతంలో వెంట్రుకలు గుంపులుగా తెల్లగా మారడం వల్ల అందరిలోనూ ఆ అభిప్రాయం మొదలైందని చెబుతున్నారు. కానీ ఆ ప్రాంతంలో మెలనిన్ ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల ఒక ప్రాంతంలో వెంట్రుకలన్నీ తెల్లగా మారిపోతాయని పేర్కొన్నారు.

 

గమనిక: ఈ కథనం కేవలం నిపుణుల నుంచి సేకరించబడి. మీకు ఎలాంటి డౌట్ ఉన్న మీకు తెలిసిన నిపుణులను సంప్రదించండి.

 

Comments