ఈరోజు, రేపట్లో అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు...!

 


జనజీవనం సాధారణ పరిస్థితికి రావడంతో అన్‌లాక్‌ 5ను ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రస్తుతం నడుస్తున్న అన్‌లాక్‌ 4 మరో రెండు రోజుల్లో పూర్తవుతుంది. దీంతో ఇవాళ సాయంత్రం లేదా,రేపు అన్‌లాక్‌ 5 ను కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇప్పటికే మెట్రో సర్వీసులకు, నిబంధనలతో 9-12 తరగతులకు విద్యార్థులకు మినహాయింపులు ఇచ్చారు. అక్టోబరు 1 నుంచి అన్‌లాక్‌ 5.0 ప్రారంభంకానుంది. దీంతో అక్టోబరులో వేటికి మినహాయింపులు ఇస్తారని జనం ఎదురుచూస్తున్నారు. గత వారం వర్చువల్‌గా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.


ఈ సందర్భంగా రాష్ట్రాల వారీగా వారి అభిప్రాయాలను సేకరించారు. కంటైన్‌మెంట్‌ జోన్లను 'మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా' గుర్తించాలని సలహాలు, సూచనలు అందాయి. త్వరలో దసరా, దీపావళి పండగలు ఉండటంతో మరిన్ని కార్యకలాపాలకు కేంద్రం అనుమతించే అవకాశం ఉంది. నిబంధనలతో మాల్స్‌, సెలూన్లు, రెస్టారెంట్లు, జిమ్‌లను తెరిచేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతి ఇవ్వగా, ఈ సారి మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. సినిమా హాళ్లకు అనుమతి ఇస్తారని సమాచారం. అలానే కరోనాతో టూరిజం రంగం తీవ్రంగా నష్టపోయింది. అన్‌ లాక్‌ 5.0లో మరిన్ని పర్యటక ప్రాంతాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉంది.

Comments

Popular posts from this blog

హుస్సేన్ సాగర్‌లోని బుద్దుడి విగ్రహం ఠీవికి వన్నె తెచ్చే...!