పాక్ కుట్ర: ఇండియాలో ఉగ్రవాదుల ట్రైనింగ్

 


భారత్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్‌ కొత్త తరహా కుట్రలు పన్నుతోంది. ఉగ్రవాద శిక్షణ శిబిరాలను జమ్మూ-కాశ్మీర్ సరిహద్దుల నుంచి భారత్ - నేపాల్ సరిహద్దులకు విస్తరించింది. భారత - నేపాల్ సరిహద్దు రాష్ట్రాలయిన ఉత్తరప్రదేశ్, బీహార్ లకు సమీపంలో పెద్ద సంఖ్యలో మసీదులు, మదర్సాలను భద్రతా ఏజెన్సీలు తాజాగా గుర్తించాయి.


బీహార్, యుపిలోని నేపాల్ సరిహద్దు లలో వీటిని దవాత్ ఇ ఇస్లామి టెరరిస్ట్‌ సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. ఇప్పటి వరకు యువతను ఉగ్రవాదులుగా మార్చడానికి 1.25 కోట్ల డబ్బును కూడా సేకరించినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. స్థానిక యువతతో పాటు బంగ్లాదేశ్ నుంచి కూడా రిక్రూట్ చేసుకుంటున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి.

Comments