Posts

పాకిస్థాన్‌ మంగళవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది.

Image
  పాకిస్థాన్‌ మంగళవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. పాకిస్థాన్‌ మంగళవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. పూంచ్‌ జిల్లా మాన్‌కోట్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట కాల్పులకు పాల్పడింది. దాయాదీ సైనికులు చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపి , మోర్టార్లతో షెల్లింగ్స్‌ చేశారని రక్షణశాఖ ప్రజాసంబంధాల అధికారి ఒకరు తెలిపారు. భారత జవాన్లు ధీటుగా స్పందించడంతో వెనక్కు తగ్గారని పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వెంట నిత్యం ఏదో ఒకచోట పాక్‌ కాల్పులకు తెగబడుతూ తన వక్రబుద్ధి ప్రదర్శిస్తూనే ఉంది. కొంతకాలంగా పూంచ్‌ , రాజౌరీ జిల్లాల్లో భారత పౌరులు , సైనిక పోస్టులే లక్ష్యంగా పాక్ సైనికులు గుళ్లవర్షం కురిపిస్తున్నారు. అటు , ఉత్తర కశ్మీర్‌ బారాముల్లా జిల్లా రామ్‌పూర్ సెక్టార్‌లోనూ ఇటీవల పాక్‌ సైన్యం కాల్పులు జరపగా భారత్ ధీటుగా బదులిచ్చింది.

భారత్‌కు చైనా వైరస్ రూపంలో మరో గండం…!

Image
  భారత్‌కు చైనా వైరస్ రూపంలో మరో గండం …! భారత్‌కు చైనా వైరస్ రూపంలో మరో గండం పొంచి ఉంది. ఇప్పటికే కరోనాతో యావత్ ప్రపంచం వణికిపోతుంటే.. తాజాగా మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. వూహాన్‌ కేంద్రంగా ' క్యాట్ క్యూ ' అనే వ్యాధిని వైద్య అధికారులు గుర్తించారు. దీని కారణంగా మన దేశానికి కూడా ప్రమాదం పొంచి ఉందని ఐసీఎంఆర్ హెచ్చరించింది. దోమలు , పందులను వాహకాలుగా చేసుకొని ఇది మనుషులకు వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. మన దేశంలో ఇది ఎంత మందిలో ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.   చైనా , తైవాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనాల్లో ఇటీవల ఈ వైరస్ వెలుగు చూసింది. దీంతో భారత్‌లో కొన్ని శాంపిళ్లను ఐసీఎంఆర్ సేకరించింది. దేశవ్యాప్తంగా 883 సీరం శాంపిళ్లను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో పరీక్షించగా , రెండు నమూనాల్లో క్యాట్‌ క్యూ వైర్‌సను తిప్పికొట్టే ఐజీజీ యాంటీబాడీల జాడను గుర్తించారు.   వీటిలో నేరుగా వైరస్ మాత్రం కనిపించలేదు. దీంతో మరికొంత మంది శాంపిళ్లను పరీక్షించాలని అభిప్రాయపడ్డారు. మలేరియా , డెంగీ , హంటా వ్యాధులు ప్రభలే అవకాశం ఉందన్నారు. కాగా మన దేశంలో క్యూలెక్స్ దోమలు , ప

ఎస్పీ బాలు హాస్పిటల్‌ బిల్‌ సంబంధించి గొడవ జరగలేదు: ఎస్పీ చరణ్

Image
  ఎస్పీ బాలు హాస్పిటల్‌ బిల్‌ సంబంధించి గొడవ జరగలేదు: ఎస్పీ చరణ్ గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం . .. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. సంగీతం ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయ్యింది. అయితే... బాలు అంత్యక్రియలు ముగిసిన తర్వాత కొందరు బాలసుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా రూమర్స్‌ను క్రియేట్‌ చేశారు. ఇంతకీ.. ఆ రూమర్స్ ఏంటంటే... చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌కు , బాలు కుటుంబానికి మధ్య హాస్పిటల్‌ బిల్‌కు సంబంధించిన గొడవ జరిగిందని. ఈ వార్త ప్రచారంలోకి రావడంతో ఇది నిజమేనా. . . ? కాదా. . . ? అనే అనుమానం. అసలు విషయం తెలుసుకోకుండానే కొన్ని మీడియా సంస్థలు ఈ వార్తను ప్రచారం చేసాయి. అయితే... ఎస్పీ చరణ్ ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరకు తీసుకెళ్తే. . .   ఆయన బిల్లు కట్టాడని వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. దీనిపై బాలసుబ్రహ్మణ్యం తనయుడు చరణ్‌ స్పందించారు. ఇంతకీ ఎస్పీ చరణ్ ఏమన్నారంటే... కొందరు కావాలనే నాన్న హాస్పిటల్‌ బిల్‌కు సంబంధించిన మాకు , ఆసుపత్రి వర్గాలకు మధ్య గొడవ జరిగిందని , చివరకు వెంకయ్యనాయుడు గారు సెటిల్‌ చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం

అద్భుతమైన ట్యాబ్ ను విడుదల చేయనున్న శాంసంగ్

Image
  అద్భుతమైన ట్యాబ్ ను విడుదల చేయనున్న శాంసంగ్   శాంసంగ్ నుంచి మరో అద్భుతమైన ట్యాబ్ వచ్చేసింది. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ 7 పేరుతో తీసుకొచ్చిన ఇందులో ఎల్‌టీఈ , వై-పై ఓన్లీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 10.4 అంగుళాల డిస్‌ప్లే , డాల్బీ అట్మోస్ సపోర్టుతో కూడిన క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. కేవలం 7 మిల్లీమీటర్ల మందంతో ఉన్న ఈ ట్యాబ్‌ ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 7,040 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన అతిపెద్ద బ్యాటరీ ఉపయోగించారు. వై-ఫై ఓన్లీ మోడల్ ధర రూ. 17,999 కాగా , ఎల్‌టీఈ వేరియంట్ ధర రూ. 21,999 మాత్రమే. ఈ ట్యాబ్ సేల్‌ డేట్ ఎప్పుడనేది శాంసంగ్ వెల్లడించనప్పటికీ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రీబుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపింది.     అలాగే , ప్రముఖ ఆన్‌లైన్ పోర్టళ్లతోపాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ప్రి బుకింగ్ చేసుకునే వినియోగదారులకు రూ. 4,499 విలువైన కీబోర్డ్ కవర్ రూ. 1,875 కే లభించనుంది. అలాగే , ఐసీఐసీఐ డెబిట్ , క్రెడిట్ కార్డులపై రూ. 2 వేల వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ 7 స్పెసిఫికేషన్లు: 10.4 అంగుళాల టీఎఫ్

అనేకత్వం నుంచి ఏకత్వంలోకి…!

Image
అనేకత్వం నుంచి ఏకత్వంలోకి …! వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151   మనం ఈ లోకంలోకి ఎందుకొచ్చామని ప్రశ్నించుకుంటే … ఎవరినుంచీ ఏ మార్గంలోనూ సమాధానం దొరకదు. ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో తప్ఫ . జీవితం రూపంలో లభ్యమైన ఇంత అమూల్యమైన ప్రయాణాన్ని ఇంత అర్థంలేని , ఇంత చవిలేని , ఇంత నిరర్థకమైన గమ్యం కోసమే చేశామని అర్థమై , వచ్చిన దారివైపు , ఆ చివర మొదలు పెట్టిన స్థానంవైపు చూస్తే … ఎంత అనాలోచితంగా , ఇంత అలవోకగా చేశామేమిటని మన అజ్ఞానానికి మనమే సిగ్గుపడతాం.   ఒక పనిని లేదా కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు తగినదాన్ని ఎన్నుకునే అవకాశం చాలావరకు మనకుంది. అల్లాటప్పా పని కాకుండా అమూల్యమైనదాన్ని , మన శ్రమకు తగిన ఫలితం ఇవ్వగలిగేదాన్ని ఎన్నుకోవాలి. మానవ జన్మ మనం ఎన్నుకున్నది కాకపోయినా (నిజానికి లోతుగా ఆలోచిస్తే అది మనం ఎన్నుకున్నదే. కర్మ ఫలాల ఫలితంగా) దాన్ని ఎలా జీవించాలనే విషయం , దేనికి ఉపయోగించుకోవాలనే విషయం , నిర్ణయం మన మేధా

ఈ రోజు మీ రాశి ఫలాలు: మంగళవారం 29 సెప్టెంబర్ 2020

Image
  ఈ రోజు మీ రాశి ఫలాలు : మంగళవారం 29 సెప్టెంబర్ 2020   వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151   మేషరాశి ( Aries) వారికి: ఈ రోజు ఎప్పుటి నుంచో ఎదురుచూస్తున్న రుణాలు వసూలవుతాయి. అంతేకాకుండా చేపట్టిన పనుల్లో , ప్రారంభించిన వ్యవహరాల్లోనూ విజయం సాధించవచ్చు. మీరు తెలివిగా పనిచేయాల్సిన సమయం. మీరు దృఢ నిశ్చయంతో పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఫలితంగా విజయం అందుకుంటారు. పశు , పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.   వృషభరాశి ( Taurus) వారికి: ఈ రోజు మీ సహోద్యోగులు , సన్నిహితుల నుంచి సహాయం అందుకుంటారు. అయితే వారిని పూర్తిగా నమ్మడం హానికరం. కాబట్టి ప్రతి పనిపై నిఘా ఉంచండి. చేపట్టిన పనులు , ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఎదురైనా చివరికి అనుకున్నది పూర్తి చేస్తారు. తమ కార్యకలాపాలన్నింటినీ అవసరానికి అనుగుణంగా నిర్వహిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బ