ఎస్పీ బాలు హాస్పిటల్ బిల్ సంబంధించి గొడవ జరగలేదు: ఎస్పీ చరణ్
ఎస్పీ బాలు హాస్పిటల్ బిల్ సంబంధించి గొడవ జరగలేదు: ఎస్పీ చరణ్
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం... తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. సంగీతం ప్రపంచం ఒక్కసారిగా
షాక్ అయ్యింది. అయితే... బాలు అంత్యక్రియలు ముగిసిన తర్వాత కొందరు బాలసుబ్రహ్మణ్యం
కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా రూమర్స్‌ను క్రియేట్ చేశారు. ఇంతకీ.. ఆ రూమర్స్ ఏంటంటే...
చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌కు, బాలు కుటుంబానికి
మధ్య హాస్పిటల్ బిల్‌కు సంబంధించిన గొడవ జరిగిందని. ఈ వార్త ప్రచారంలోకి రావడంతో
ఇది నిజమేనా...? కాదా...? అనే అనుమానం. అసలు విషయం తెలుసుకోకుండానే కొన్ని మీడియా సంస్థలు ఈ
వార్తను ప్రచారం చేసాయి.
అయితే...
ఎస్పీ చరణ్ ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరకు తీసుకెళ్తే... ఆయన బిల్లు కట్టాడని వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్
చేశాయి. దీనిపై బాలసుబ్రహ్మణ్యం తనయుడు చరణ్ స్పందించారు. ఇంతకీ ఎస్పీ చరణ్
ఏమన్నారంటే... కొందరు కావాలనే నాన్న హాస్పిటల్ బిల్‌కు సంబంధించిన మాకు, ఆసుపత్రి వర్గాలకు మధ్య గొడవ జరిగిందని, చివరకు వెంకయ్యనాయుడు గారు సెటిల్ చేశారంటూ
దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు అని ఎస్పీ చరణ్ స్పష్టం
చేసారు.
అయితే... ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారనేది నాకు తెలియడం లేదు. నాన్నకు సంబంధించిన విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. డాక్టర్స్ ఎంతగానో సపోర్ట్ చేశారు. మెరుగైన వైద్యం అందించారు. హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌తో చర్చించి అభిమానులందరికీ వివరిస్తూ.. త్వరలో ఓ ప్రెస్‌మీట్ పెడతాను అని చెప్పారు.
Comments