అద్భుతమైన ట్యాబ్ ను విడుదల చేయనున్న శాంసంగ్

 


అద్భుతమైన ట్యాబ్ ను విడుదల చేయనున్న శాంసంగ్

 

శాంసంగ్ నుంచి మరో అద్భుతమైన ట్యాబ్ వచ్చేసింది. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ7 పేరుతో తీసుకొచ్చిన ఇందులో ఎల్‌టీఈ, వై-పై ఓన్లీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 10.4 అంగుళాల డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్ సపోర్టుతో కూడిన క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. కేవలం 7 మిల్లీమీటర్ల మందంతో ఉన్న ఈ ట్యాబ్‌ ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 7,040 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన అతిపెద్ద బ్యాటరీ ఉపయోగించారు. వై-ఫై ఓన్లీ మోడల్ ధర రూ.17,999 కాగా, ఎల్‌టీఈ వేరియంట్ ధర రూ.21,999 మాత్రమే. ఈ ట్యాబ్ సేల్‌ డేట్ ఎప్పుడనేది శాంసంగ్ వెల్లడించనప్పటికీ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రీబుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపింది. 

 

అలాగే, ప్రముఖ ఆన్‌లైన్ పోర్టళ్లతోపాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ప్రి బుకింగ్ చేసుకునే వినియోగదారులకు రూ.4,499 విలువైన కీబోర్డ్ కవర్ రూ. 1,875కే లభించనుంది. అలాగే, ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ. 2 వేల వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ7 స్పెసిఫికేషన్లు: 10.4 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662 చిప్‌సెట్, 3జీబీ ర్యామ్, 32 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Comments