ఆరో రోజు అలిగిన బతుకమ్మ...! | Aligina bathukamma today

ఆరో రోజు అలిగిన బతుకమ్మ...!



వివరణ: డాయంఎన్చార్యప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషజాతకవాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులుసునంద రాజన్ జ్యోతిషజాతకవాస్తు కేంద్రంతార్నాకహైదరాబాద్ఫోన్: 9440611151


ఆరో రోజు 'అలిగిన బతుకమ్మ' ఎందుకంటే…?


బతుకమ్మ పండుగలో ఆరో రోజును 'అలిగిన బతుకమ్మ' అంటారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు. అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు.

తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ పండుగ. ఆడపడచుల పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.

ఈ ఏడాది అక్టోబర్ నెలలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఐదురోజుల బతుకమ్మ వేడుకల్లో ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ వేడుకలు ముగిశాయి.

ఇక బతుకమ్మ పండుగలో ఆరో రోజును 'అలిగిన బతుకమ్మ' అంటారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు. అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు. ఆమెకు ఈ రోజు ఏ నైవేద్యం ఉండదు. పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని 6వ రోజు బతుకమ్మను ఆడరు. అప్పటి నుంచి ఈ రోజును 'అలిగిన బతుకమ్మ' గా పిలుస్తారు.

రామ రామ రామ ఉయ్యాలో బతుకమ్మ పాట మీ కోసం...!

రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో
రామ రామ నంది ఉయ్యాలో రాగమేత్తరాదు ఉయ్యాలో
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో నేలవన్నేకాడ ఉయ్యాలో
పాపిటలో చంద్రుడా ఉయ్యాలో బలాకుమరుడా ఉయ్యాలో

పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెత్తరామాసము ఉయ్యాలో
బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో
తెల్ల తెల్లయి గుళ్లు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్లు ఉయ్యాలో
పన్నెండేండ్ల కింద ఉయ్యాలో పాడుబడ్డ గుళ్లు ఉయ్యాలో

తెల్లయి వేములవాడ ఉయ్యాలో రాజన్న గుళ్లు ఉయ్యాలో
నల్ల నల్లయి గుళ్లు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్లు ఉయ్యాలో
నల్లయి నల్గొండ ఉయ్యాలో నరసింహ గుళ్లు ఉయ్యాలో
పచ్చ పచ్చయి గుల్లు ఉయ్యాలో పచ్చయమ్మ గుళ్లు ఉయ్యాలో

పచ్చయి పరకాన ఉయ్యాలో మల్లన్న గుల్లు ఉయ్యాలో
పర్వతాల మల్లన ఉయ్యాలో పదములు సెలవయ్య ఉయ్యాలో
రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో

Comments