శరన్నవరాత్రుల పూజా విధానం…! #Navaratrula puja vidhanam



వివరణ: డాయంఎన్చార్యప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషజాతకవాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులుసునంద రాజన్ జ్యోతిషజాతకవాస్తు కేంద్రంతార్నాకహైదరాబాద్ఫోన్: 9440611151


శరన్నవరాత్రుల పూజా విధానంతప్పక తెలుసుకోవాల్సినవి శ్రీదేవీ శరన్నవరాత్రులు ప్రారంభించే ముందు రోజునాటికే పూజాసామగ్రిపూజాద్రవ్యాలుహోమద్రవ్యాలు సిద్దం చేసుకోవాలి. పూజామందిరంలో అంగుళాలు ఎత్తుగల పీరాన్ని ఏర్పరచుకొనిపీఠముపై ఎర్రని వస్త్రము పరచిబియ్యము పోసిదానిపై సువర్ణరజితలేదా తామ్రా కలశమును ఉంచికలశమునకు దారములు చుట్టికలశములో పరిశుద్ద నదీజలములను నింపిఅందు లవంగములుయాలకులుజాజికాయపచ్చ కర్పూరము మొదలగు సువర్ణ ద్రవ్యాలు వేసినవరత్నాలుపంచలోహాలను వేసిపసుపుకుంకుమరక్తచందనచందనాదులను వేసిమామిడిమారేడుమోదుగమర్రిజమ్మి చిగుళ్ళను ఉంచిపరిమళ పుష్పాదులను వేసిదానిపై పీచు తీయనిముచ్చిక కలిగిన టెంకాయనుంచిదానిపై ఎర్రని చీరరవిక వేసికలశమును చందనకుంకుమపుష్పాదులతో అలంకరించాలి.


యధా శాస్త్రీయముగా విఘ్నేశ్వరపూజ చేసిరక్షా బంధన పూజ చేసిరక్షా బంధనాన్ని ధరించికలశ స్థాపన పైన చెప్పిన విధంగా చేసిప్రాణ ప్రతిష్ట కరన్యాసములు చేసిషోడశ ఉపచారములతో శ్రీ సూక్త విధానంగా సహస్ర నామములతో, త్రిశతీనామములతోఅష్ణోత్తరశతనామములతోదేవి ఖడ్గమాల నామములతో, పసుపుకుంకుమహరిద్రాక్షతలుకుంకుమాక్షతలురక్తచందనాక్షతలుశ్రీచందనాక్షతలుబిల్వదళములుతులసీదళములుపరిమళ పుష్పాదులతో అర్చన చేయవలెను. నవకాయ పిండి వంటలతో రకరకాలైన ఫలములనుచలివిడివడపప్పుపానకముతేనెపంచదారపెరుగునివేదన చేసిమంగళహారతిచ్చి అమ్మవారిని ఈవిధంగా ప్రార్జించాలి.


తల్లీ! ఈ నవరాత్రులు నా ఈ శరీరాన్ని మనసును నీ అధీనం చేస్తున్నాను. నాచే ఈ నవరాత్ర ప్రతదీక్ష దిగ్విజయంగా నిర్వహింపచేసుకొనినన్ను ఆశీర్వదించు తల్లీ అని ప్రార్థించాలి. ఈ విధంగా నవరాత్ర వ్రతము ఆరంభించిన దగ్గర నుండి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచిస్నాన సంధ్యాదులు ముగించుకొనిత్రికాలార్చనగానీషట్కాలార్చనలతోగానీ అమ్మవారిని తృప్తి పరుసూఉదయం నుండి సాయంత్రం వరకూ ఉపవాసముండిసాయంకాల అర్చన ముగించుకొని అమ్మవారికి మహా నివేదన గావించి నక్షత్రములను దర్శించి భోజనము చేయాలి. ఉల్లివెల్లుల్లి విసర్జించాలి. సాంసారిక సుఖానికి దూరంగా ఉండాలి. మౌనంగా ఉండాలి. పరిశుద్ధంగాపవిత్రంగా ఉండాలి. భూమిపైనే శయనించాలి.


ప్రతి నిత్యము అమ్మవారిని నవదుర్గా రూపములో అలంకరించుకొని ఆరాధించాలి. అమ్మవారి యొక్క విగ్రహాన్ని స్థాపన చేసుకోదలచిన వారు అమ్మవారు సింహవాహనాన్ని అధిరోహించి అష్టభుజాలతోఅష్టవిధ ఆయుధాలను ధరించిసౌమ్య మూర్తియై అభయ ప్రదానం సౌమ్య స్వరూపిణిగా గానీ చతుర్భుజాలతో పద్మాసనం వేసుకొని సింహాసనం మీద కూర్చొని చతుర్భుజాలలో అభయవరదపాశఅంకుశములను ధరించిసౌమ్య మూర్తిగా కిరీటములో చంద్రవంకను ధరించినటువంటి విగ్రహాన్నిగానీ స్థాపించుకొని ఆరాధించాలి.


ప్రతినిత్యము అమ్మకు ప్రియమైన చండీ సప్తశతీదేవీ భాగవతసౌందర్యలహరి పారాయణలను చేసుకుంటూ వుండాలి. సువాసినీపూజకుమారీపూజశ్రీ చక్ర నవావరణార్చనాది అర్చనలతో అమ్మవారిని తృప్తి పరుస్తూ ఉండాలి. గీతవాద్యనృత్యాదులతో అమ్మవారికి ఆనందాన్ని కలుగచేయాలి. నామ సంకీర్తనలతో ఆ తల్లిని ఆనందింప చేయాలి. దీపాలు వెలిగించి ఆ తల్లికి సంతోషాన్ని కలుగచేయాలి. అమ్మవారికి ప్రియమైన శ్రీ విద్యచండీదశమహావిద్యాది హోమాదులతో అమ్మను తృప్తిపరచాలి.


అమ్మకు ప్రియమైన బాలాషడక్షరీలలితాపంచదశాక్షరీరాజరాజేశ్వరీ మహాషోడశాక్షరీమహామంత్రాదులను యధాశక్తి జపించాలి. ఎర్రని వస్త్రాలు మాత్రమే ధరించాలి. ఎర్ర చందనముచందనముపసుపుకుంకుమ ధరించాలి. అమ్మకు ప్రియమైన ముత్యాలపగడాలరుద్రాక్ష మాలికలను ధరించాలి. అమ్మభావన కలిగిఅమ్మను ఆరాధిస్తుండాలి. పరుషమైన మాటలుఅమంగళకరమైన వాక్యాలు పలుకకూడదు. గోవులను శక్యానుసారముగా గ్రాసం పెట్టి నవరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. కృత్తికస్వాతిరేవతిపుష్యమి నక్షత్రాలు కలిసిన ఆది 'భాను'వారం చేస్తే శ్రేష్టం.

Comments