ఆలయ ప్రాకారాల్లోని సాలహారాల్లో విగ్రహాలు ఏర్పాటు
ఆలయ ప్రాకారాల్లోని సాలహారాల్లో విగ్రహాలు
ఏర్పాటు
అద్భుతంగా పునర్నిర్మితమవుతున్న యాదాద్రి ప్రధాన ఆలయ
ప్రాకారాల్లోని సాలహారాల్లో విగ్రహాల ఏర్పాటు పనులు మంగళవారం ప్రారంభించారు. ఆలయానికి
తూర్పున ప్రాకార ద్వారంపై ఏర్పాటు చేసే శంకు, చక్ర, నామాల విగ్రహాలకు ఆర్కిటెక్ట్
ఆనందసాయి, ప్రధాన స్థపతి ఆనందచార్యుల వేలు, ఉప స్థపతి గణేశ్, ఇతర స్థపతులు పూజలు
చేశారు. అనంతరం సాలహారాల్లో విగ్రహాల ఏర్పాటు పనులు ప్రారంభించారు.
అలాగే ఆలయానికి నలు దిక్కులా గరుడ, సింహాల విగ్రహాల ఏర్పాటు పనులు కూడా
మొదలు పెట్టారు. వీటి ఏర్పాటు మూడు రోజుల్లో పూర్తవుతుందని ఆర్కిటెక్ ్టఆనందసాయి
తెలిపారు. అలాగే శివాలయంలో నంది విగ్రహానికి ఆనందసాయి పూజలు చేసి విగ్రహా ఏర్పాటు
పనులు ప్రారంభించారు. కాగా సాలహారాల్లో విగ్రహాల ఏర్పాటుకు సంబందించి సోమవారం చినజీయర్
స్వామి సూచనలు, సలహాలు తీసుకున్న విషయం తెలిసిందే. మంగళవారమే వీటి ఏర్పాటు పనులు
ప్రారంభించారు.
Comments