వారఫలితాలు: తేదీ 16 అక్టోబర్ శుక్రవారం నుండి అక్టోబర్ 22 గురువారం 2020 వరకు

 వారఫలితాలు: తేదీ 16 అక్టోబర్ శుక్రవారం నుండి అక్టోబర్ 22 గురువారం 2020 వరకు




వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151


మేషరాశి (Aries) వారికి: ఈ వారం వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు ముఖ్య సమాచారం అందుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కోర్టు వివాదాల నుంచి కొంత బయటపడతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండిపశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


వృషభరాశి (Taurus) వారికి: ఈ వారం  ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే వీలుంది. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో కొనసాగి లాభాలు అందుకుంటారు. అనుకున్న పనులు కొంత నిదానంగా సాగినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. స్థిరాస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. వారం మధ్యలో ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండిపశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


మిధునరాశి (Gemini) వారికి: ఈ వారం ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ముందడుగు వేస్తారు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆలోచనలు స్థిరంగా కొనసాగవు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. అయితే ఏదోవిధంగా కొంత సొమ్ము అంది అవసరాలు తీరతాయి. నిరుద్యోగులు ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


కర్కాటకరాశి (Cancer) వారికి: ఈ వారం ముఖ్య నిర్ణయాలు తీసుకుని మిత్రులను ఆశ్చర్యపరుస్తారు. పారిశ్రామిక వర్గాలకు భాగస్వాముల నుంచి సమస్యలు తీరతాయి. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి. ఆప్తుల సహాయ సహకారాలు తీసుకుంటారు. మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. కొన్ని ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు.  వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండిపశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


సింహరాశి (Leo)  వారికి: ఈ వారం సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. వ్యాపారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత మేరకు తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. అనుకున్న పనులు తక్షణం పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కలసివచ్చి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండిపశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


కన్యారాశి (Virgo) వారికి: ఈ వారం వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. పనుల్లో అవాంతరాలు అధిగమించి పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యల నుంచి బయటపడతారు. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా అడుగులు వేస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండిపశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


తులారాశి (Libra) వారికి: ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఆందోళన తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పారిశ్రామికవర్గాలకు లక్ష్యాలు నెరవేరతాయి. ఏ పని ప్రారంభించినా వెనుకడుగు వేయకుండా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం, నమ్మకమే మీ ఆయుధాలుగా నిలుస్తాయి. గతంలో చేజారిన కొన్ని డాక్యుమెంట్లు అనుకోని విధంగా లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత ఆశాజనకంగా ఉంటాయి. పరపతి పెరుగుతుంది. వారం మధ్యలో ధనవ్యయం. బంధువులతో తగాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


వృశ్చికరాశి (Scorpio) వారికి: ఈ వారం కుటుంబసభ్యుల సూచనలు అనుసరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పనులలో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు కొంతమేర తీరతాయి. నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలిస్తాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన ఆదాయం సమకూర్చుకుంటారు. రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమేత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండిపశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


ధనుస్సురాశి (Sagittarius) వారికి: ఈ వారం ఉద్యోగాలలో ఒడిదుడుకులు, సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలు విస్తరించే దిశగా అడుగులు వేస్తారు. ఉద్యోగాలలో ప్రశాంతత చేకూరుతుంది. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుకుని సఖ్యత నెలకొంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. అనుకున్న పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


మకరరాశి (Capricorn) వారికి: ఈ వారం వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొన్ని వివాదాలు సోదరుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న పోస్టులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. ప్రత్యర్థులను అనుకూలురుగా మార్చుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఒక సంఘటనకు ఆకర్షితులవుతారు. వారం మధ్యలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


కుంభరాశి  (Aquarius) వారికి: ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా సాగి పెట్టుబడులు సైతం అందుకుంటారు. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కుటుంబం లో శుభకార్యాల నిర్వహణపై సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఇంటి నిర్మాణయత్నాలలో ముందడుగు వేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వారం చివరిలో ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండిపశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


మీనరాశి (Pisces) వారికి: ఈ వారం వ్యాపారాలు సజావుగా సాగి లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. కొన్ని సమస్యలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు కొంత నిదానించినా పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్యం, కొంత జాగ్రత్త వహించండి. చివరి నిమిషంలో కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండిపశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


గమనిక: ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయాలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు.


జై శ్రీమన్నారాయణ.

Comments