వారఫలితాలు: తేదీ 23 అక్టోబర్ శుక్రవారం నుండి 29 గురువారం 2020 వరకు | #Weekly Astrology October 2020

వారఫలితాలు: తేదీ 23 అక్టోబర్ శుక్రవారం నుండి 29 గురువారం 2020 వరకు



వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151


మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి: ఈ వారం  వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త  హోదాలు రావచ్చు. పారిశ్రామిక వర్గాలకు శ్రమకు తగిన ఫలితం దక్కే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పనులు నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్నా అవసరాలకు ఇబ్బంది ఉండదు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి . అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


వృషభరాశి (Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి: ఈ వారం  వ్యాపారాలలో తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. అనుకున్న పనులు జాప్యం లేకుండా పూర్తి చేస్తారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. ఖర్చులు అదుపులోకి వస్తాయి. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు.వారం చివరిలో వ్యయప్రయాసలు. ఇంటా బయటా ఒత్తిడులు. వ్యవహారంలో, కుటుంబంలో శ్రమాధిక్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


మిధునరాశి (Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి: ఈ వారం వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. కళారంగం వారికి నిరీక్షణ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో బంధువులతో మాటపట్టింపులు. కొన్ని నిర్ణయాలు మిత్రులను ఆశ్చర్యపరుస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. విద్యార్థుల ప్రయత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు.  ఆరోగ్యభంగం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


కర్కాటకరాశి (Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి: ఈ వారం మీ ఊహలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు, వివాదాలు సర్దుమణుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు. వారం ప్రారంభంలో బంధువులతో విభేదాలు. ధనవ్యయం. ఒత్తిడులు. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. ముఖ్య పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కొత్త కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాలు ఎట్టకేలకు పరిష్కరించుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి: ఈ వారం చిరకాల మిత్రులను కలుసుకుంటారు. సేవాభావంతో అందర్నీఆకట్టుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. వివాహ, ఉద్యోగాయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు అనూహ్యమైన పిలుపు అందవచ్చు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలపై ఒక నిర్ణయానికి వస్తారు. మీ సత్తా, సమర్థతను చాటుకునే అవకాశం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.  వారం మధ్యలో కుటుంబసమస్యలు. నిర్ణయాలలో మార్పులు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


కన్యారాశి (Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి: ఈ వారం ఇంటి నిర్మాణాల్లో కొన్ని అవరోధాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. కళారంగం వారికి చికాకులు తప్పవు. ముఖ్య పనులు కొన్ని వాయిదా వేస్తారు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని సమస్యలు వేధిస్తాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా. ఒక సమాచారం కొంత నిరాశపరుస్తుంది. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఉద్యోగలాభం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


తులారాశి (Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి: ఈ వారం ఆర్థికంగా బలం చేకూరి అవసరాలు తీరతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ప్రయత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ధనవ్యయం. ఆప్తులు, బంధువుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అధిక లాభాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


వృశ్చికరాశి (Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి: ఈ వారం మీ ఆలోచనలు మిత్రులను ఆకట్టుకుంటాయి. వాహనాలు, భూములు కొంటారు. కొన్ని సమస్యలు, వివాదాలు అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు. కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సుదీర్ఘ విరామం అనంతరం బంధువులను కలుసుకుంటారు. వారం ప్రారంభంలో  అనుకోని ఖర్చులు. బంధువులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


ధనుస్సురాశి  (Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి: ఈ వారం ముఖ్య పనులు విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు ఊరటనిస్తాయి. ఉద్యోగాలలో తగినంత గుర్తింపు లభిస్తుంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు కొన్ని దక్కే సూచనలు. వారం చివరిలో బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. చేపట్టిన పనులలో అనవసర జాప్యం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.  విద్యార్థులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


మకరరాశి (Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి: ఈ వారం చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలలో అనుకోని విధంగా లాభాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఊరట. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు. ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. సమాజసేవలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు కొన్ని  దక్కుతాయి. వాహనయోగం. వివాదాల నుంచి ఎట్టకేలకు  బయటపడతారు. సోదరులతో సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


కుంభరాశి  (Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి: ఈ వారం ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాముల నుంచి కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో మీరే చొరవ చూపుతారు. వారం ప్రారంభంలో మిత్రులతో స్వల్ప వివాదాలు. అనుకోని ధనవ్యయం. వృథా ప్రయాస. స్వల్ప ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండిపశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


మీనరాశి (Pisces) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి: ఈ వారం వాహనసౌఖ్యం. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో మరింత పురోగతి ఉంటుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగి రుణాలు సైతం తీరుస్తారు. కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. కుటుంబసమస్యలు క్రమేపీ తీరతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వారం ప్రారంభంలో ధననష్టం. బంధువిరోధాలు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


గమనిక: ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయాలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు.


జై శ్రీమన్నారాయణ.

Comments