Posts

Showing posts from September, 2020

మీ చేతి రేఖల ద్వారా మీ దాంపత్య జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి | Pamistry...

Image

ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 30 సెప్టెంబర్ 2020

Image
  ఈ రోజు మీ రాశి ఫలాలు : బుధ వారం 30 సెప్టెంబర్ 2020 వివరణ : డా . యం . ఎన్ . చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం . తార్నాక , హైదరాబాద్ . ఫోన్ : 9440611151   మేషరాశి ( Aries) వారికి: ఈ రోజు స్నేహితులు , కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ప్రత్యర్థుల నుంచి ఓటమి పాలవుతారు. నిర్మాణ పనుల అవసరాన్ని మీరు అనుభవిస్తారు. ఏదైనా శుభవార్త మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. అనుకూలంగా ఉంటుంది. అపరిచితుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఫలితంగా ప్రయోజనం పొందుతారు. చేపట్టిన పనులకు చేసిన అన్ని ప్రయత్నాలు పూర్తవుతాయి. పశు , పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.   వృషభరాశి ( Taurus) వారికి: ఈ రోజు అనవసర సందేహాలకు దూరంగా ఉంటే మంచిది. తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించకూడదు. మీకు హాని జరిగే అవకాశముంది. ఆర్థిక విషయాల్లో సమస్యల కారణంగా ఒత్తిడికి గురవుతారు. మీరు తీసుకునే నిర్ణయంలో పెద్దగా ఉత్సాహం చూపకూడదు. ఇది మీ పనిని పాడుచేస్తుంద

గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపం, గవ్వలతో ఇలాచేస్తే…!

Image
  గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపం , గవ్వలతో ఇలాచేస్తే …! వివరణ: డా. యం.ఎన్. చార్య , ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష , జాతక , వాస్తు శాస్త్ర పండితులు , శ్రీమన్నారాయణ ఉపాసకులు , సునంద రాజన్ జ్యోతిష , జాతక , వాస్తు కేంద్రం. తార్నాక , హైదరాబాద్. ఫోన్: 9440611151   గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏవిధమైన ప్రాదాన్యత ఉందో గవ్వలకు అదేవిధమైన ప్రాధాన్యత ఉంది.   గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు. కొన్ని దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణేలుగా చలామణి చేయటం ఇప్పటికీ అమలులో ఉంది.   దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు.   గవ్వలు లక్ష్మీ దేవి చెల్లెల్లు అని , శంఖాలను లక్ష్మీదేవి సోదరులనీ భావిస్తుంటారు. గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబందం ఉంది.   శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలు కూడ ఉంటాయి. శివుని జటాజూటంలోను , శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందంగా ఉంటాయి.   గవ్వలు అలంకరణ వస్తువుగాను , ఆటవస్తువుగాను , తాంత్రిక వస్తువుగాను ఉపయోగప

చైనాతో మరోమారు యుద్ధం తప్పదా…!

Image
చైనాతో మరోమారు యుద్ధం తప్పదా …!   సరిహద్దు సమస్య చర్చల ద్వారా పరిష్కారం అయ్యే సూచనలు కనుచూపుమేరలో కనిపించని నేపథ్యంలో చైనా భారత్ పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతున్న సూచనలు కనబడుతున్నాయి. అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణులతో సహా భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించి పలు క్షిపణులను భారత్ చైనాతో సరిహద్దుల్లో మోహరించింది. దీనికి ప్రతిగా చైనా కూడా రెండు వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను మోహరించింది. రెండుదేశాల సన్నాహకాలను చూస్తుంటే సమీప భవిష్యత్తులో ఇరుదేశాలూ యుద్దానికి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోందని రక్షణరంగ నిపుణులు పేర్కొంటున్నారు. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా భారత్ , చైనాలు తమ తమ సరిహద్దుల రక్షణ కోసం , ప్రత్యర్థి దేశంపై దాడి కోసం ఆధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నాయి.  2 వేల కి.మీల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను , భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను జిన్‌జియాంగ్ , టిబెట్‌ ప్రాంతాల్లో చైనా మోహరించింది. ప్రతిగా బ్రహ్మోస్ , నిర్భయ్ , భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల ఆకాశ్‌ క్షిపణులను భారత్‌ సిద్ధం చేసింది.   భారత్ సేకరించిన క్షిపణుల్లో బ్రహ్మో

పూరీ ఆలయంలో ఇలా జరిగిందేంటి...?

Image
  పూరీ ఆలయంలో ఇ లా జరిగిందేంటి... ?   ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో పనిచేస్తున్న 400 మందికి పైగా సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఒడిశా ప్రభుత్వ అధికారులు సోమవారం స్పష్టం చేశారు. పూరీ శిరిమందిరాన్ని తిరిగి భక్తుల సందర్శన కోసం తెరవాలని డిమాండ్లు వినిపిస్తున్న సమయంలో... అధికారులు ఈ విషయం బయటపెట్టారు. " 400 మందిలో 9 మంది కరోనా వైరస్ వల్ల చనిపోయారు. 16 మందికి భువనేశ్వర్‌లోని కోవిడ్ 19 ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతోంది" అని శ్రీ జగన్నాథ ఆలయ పర్యవేక్షణ , పాలన అధికారి అజయ్ కుమార్ జెనా తెలిపారు. కరోనా సోకిన చాలా మంది ఆలయ సిబ్బంది ఇళ్ల దగ్గరే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఆయన వివరించారు. అందువల్ల ఆలయాన్ని తెరిచేందుకు , భక్తులను అనుమతించేందుకు సిబ్బంది కొరత ఉందన్నారు.   ప్రస్తుతం పూరీ ఆలయం భక్తుల కోసం తెరవకపోయినా... రోజువారీ పూజలు జరుగుతున్నాయి. ఆలయ పూజారులు మాత్రం... నవంబర్ చివరి వరకూ ఆలయంలోకి భక్తులను అనుమతించకపోవడం మేలంటున్నారు. తమ వర్గానికి చెందిన వారికే ఎక్కువగా కరోనా సోకుతోందని అభ్యంతరం చెబుతున్నారు. ఇదే విషయాన్ని రిపోర్టు రూపంలో హైకోర్టుకు సమర్పించింది ఒడ

బిగబాస్: ఈ వారం నామినేషన్‌లో ఆ ఏడుగురు

Image
బిగబాస్: ఈ వారం నామినేషన్‌లో ఆ ఏడుగురు సోమవారం వస్తే ఎలిమినేషన్‌కు సంబంధించి నామినేషన్ ప్రక్రియ జరగడం కామన్. ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఏడుగురు సభ్యులు ఉండగా , వారిలో ఎవరు ఇంటిని వీడనున్నారనేది ఆసక్తిగా మారింది. సోమవారం ఎసిపోడ్ గోంగూర తోట కాడ కాపుకాశా అనే పాటతో మొదలైంది. ఆ తర్వాత మార్నింగ్ మస్తీలో భాగంగా స్వాతీ దీక్షిత్ మిగతా ఇంటి సభ్యులకు నవరసరాలు నేర్పించింది. శంగార రసం అభిజిత్‌తో చేయగా , విషాదం నోయల్‌తో చేసింది. తండ్రి పాత్రని నోయల్ పోషించగా , ఆయన చనిపోయిన క్రమంలో స్వాతి వెక్కి వెక్కి ఏడ్చింది. అది చూసి మోనాల్ కూడా కంట కన్నీరు పెట్టుకుంది.   భీభత్సం, రసం పండించేందుకు నోయల్‌-లాస్య రంగంలోకి దిగారు. వీరిద్దరు నటనకు అంతా ఫిదా అయ్యారు.   గట్టిగా గట్టిగా అరుస్తూ తమ తమ పాత్రలలో తెగ జీవించేశారు. ఇక ఆ తర్వాత దివి నామినేషన్ విషయంలో మెహబూబ్ తో పాటు అభిజిత్‌తో చర్చించింది. అనంతరం అవినాష్‌... అరియానాతో రొమాంటిక్ చర్చలు జరపగా , ఆ తర్వాత మోనాల్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కొంత సేపు హాస్యం పండించి అందరిని నవ్వించాడు.   ఇక బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టగా ఇందులో సోహైల్-అఖ