ఈ రోజు మీ రాశి ఫలాలు: శనివారం 3 అక్టోబర్ 2020

ఈ రోజు మీ రాశి ఫలాలు: శనివారం 3 అక్టోబర్  2020



మేషరాశి (Aries) వారికి: ఈ రోజు సమాజంలో మీకు పేరు, ప్రతిష్ఠలతో పాటు కీర్తి పెరుగుతుంది. శత్రువులు మీకోసం కుట్రలు పన్నుతారు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. కుటుంబంతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. విద్యార్థులు కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు. కుటుంబంలో వివాదాలు, గొడవలకు దూరంగా ఉండండి. మీ పనిపై మాత్రమే దృష్టి పెడితే మంచిది. ప్రమాదాకర పెట్టుబడులను నివారించండి. విజయం కోసం విద్యార్థులు ఏకాగ్రతను పాటించాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


వృషభరాశి (Taurus) వారికి: ఈ రోజు వ్యాపారస్థులకు ఈ సమయం చాలా ఉత్తమ. నూతన సాంకేతిక వల్ల వ్యాపారం లాభిస్తుంది. తండ్రితో సంబంధాలు బలపడతాయి. పెట్టుబడుల్లో లాభాలు అందుకుంటారు. ఆస్తి పెరుగుతుంది. అదనపు పనిని కేటాయించవచ్చు. ఉద్యోగస్థులను నూతన బాధ్యతలు వస్తాయి. కుటుంబంలో ముఖ్యమైన పని చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీరు నూతన విషయాలను నేర్చుకోవడం కోసం ప్రయత్నించవచ్చు. ఇందులో మీకు విజయం వరిస్తుంది. అంతేకాకుండా గౌరవమర్యాదలు కూడా పొందుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
మిధునరాశి (Gemini) వారికి: ఈ రోజు వ్యాపారంలో నూతన ఒప్పందాల నుంచి ప్రయోజనం అందుకుంటారు. నిరుద్యోగ యువతకు కొత్త అవకాశాలు లభిస్తాయి. బాధ్యతయుతమైన పనులను కార్యాలయంలో చూడవచ్చు. జీవిత భాగస్వామి భావాలను గౌరవించాలి. సోదరులతో కలిసి సమయాన్ని గడుపుతారు. వారి కోరికలను నెరవేర్చుకుంటారు. కొంత సమయాన్ని కేటాయించాలి. శాశ్వత ఆస్తుల నుంచి ప్రయోజనం పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) వారికి: ఈ రోజు అవసరమైన విషయాలను కుటుంబంతోచర్చించుకుంటే మంచిది. స్నేహితులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. కోర్టు కేసులు కూడా ప్రబలగా ఉంటాయి. ఉపాధి పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. కుటుంబంలో ఆనందంతో పాటు శ్రేయస్సు ఉంటుంది. నిపుణుల సలహాతో పెట్టుబడి పెడితే లాభాలు అందుకుంటారు. దుకాణాదారులకు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా అనుకూలమైన సమయమిది. అప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి (Cancer) వారికి: ఈ రోజు అధికారుతో మీ బంధం బలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ సహచరులు సహకరిస్తారు. ప్రేమ జీవితాని సమయం ఇస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఇది మీ ప్రభావాన్ని పెంచుతుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు పెరుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీరు ఎంచుకున్న రంగంలో మీ నాయకత్వంలో జరుగుతున్న పనుల్లో మీరు విజయం సాధిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి (Libra) వారికి: ఈ రోజు ఆకస్మిక ప్రయోజనాలు పొందుతారు. ఆదాయ మార్గాలను పెంచడానికి నూతన మార్గాలు సృష్టించబడతాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే తినడంలో, తాగడంలో నిర్లక్ష్యం వహించవద్దు. స్నేహితుడికి సహాయం చేయడానికి ప్రేమ జీవితంలో గౌరవం పొందడానికి అవకాశం లభిస్తుంది. ఏకాగ్రతతో పనిచేస్తే విజయం సాధిస్తారు. స్వయం ఉపాధి రంగంలో నూతన ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

కన్యారాశి (Virgo) వారికి: ఈ రోజు విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారికి శుభవార్త లభిస్తుంది. అలాగే కార్యాలయంలో పదోన్నతి పొందే అవకాశముంది. బంధువుల నుంచి డబ్బు లావాదేవీల్లో జాగ్రత్త వహించండి. సానుకూల ఫలితాలుంటాయి. ఏ పోటీలోనైనా విజయం సాధించేందుతు తహతహ లాడుతారు. మీకిష్టమై వ్యక్తుల్ని కలుస్తారు. కుటుంబంతో బయటకు వెళ్లడానికి ఓ ప్రణాళిక సిద్ధం చేస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

వృశ్చికరాశి (Scorpio) వారికి: ఈ రోజు వ్యాపారంలో తండ్రి మార్గదర్శకత్వంలో నడుస్తారు. ప్రభుత్వాధికారుల పరిస్థితి మెరుగుపడుతుంది. పొదుపు కూడా పెరుగుతుంది. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీరు నూతన ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారాంలో భాగస్వాములు ప్రయోజనం పొందుతారు. ఏదైనా నూతన ఒప్పందం నుంచి ప్రయోజనం పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి (Capricorn) వారికి: ఈ రోజు ఉన్నత విద్యలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అడ్డంకులు అంతమవుతాయి. ఈ రంగంలో నూతన మర్పులు ఉంటాయి. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. స్వయం ఉపాధిరంగంలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. నూతన అవకాశాలు కూడా సిద్ధిస్తాయి. ప్రమాదకర పెట్టుబడుల్లో అదృష్టం మద్దతు ఇస్తుంది. జీవిత భాగస్వామి సహాయంగా ఉంటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. స్నేహితులు, అతిథులు సాయంత్రం ఇంటికి రావచ్చు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

ధనుస్సురాశి (Sagittarius) వారికి: ఈ రోజు విజయం తర్వాత మనస్సు కూడా సంతోషంగా ఉంటుంది. సంతానం భవిష్యత్తు గురించ ఆందోళన చెందుతారు. జీవిత భాగస్వామి సాయంతో కుటుంబానికి అవసరమైన నిర్ణయాన్ని తీసుకోవచ్చు. వ్యాపారంలో నూతన అవకాశాలు ఉంటాయి. లాభాలు అందుకుంటారు. పనిప్రదేశంలో తొందరపాటుతో వ్యవహరించవద్దు. ప్రతి విషయాన్ని క్షుణ్నంగా పరిశీలించి పూర్తి చేస్తే మంచిది. పనిభారం పెరుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి (Aquarius) వారికి: ఈ రోజు సమాజ శ్రేయస్సు కోసం కొంత పని చేస్తారు. ఇది మీ ప్రభావ రంగాన్ని పెంచుతుంది. కుటుంబంలో కొంత ఉద్రిక్తత వాతావరణం ఉంటుంది. తోబుట్టువులతో సంబంధాల్లో తీపి ఉంటుంది. కుటుంబ వ్యాపారాన్ని పై స్థానానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించవచ్చు. పదోన్నతులు లభిస్తాయి. రోజువారీ వ్యాపారవేత్తల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది. తీర్థయాత్రకు వెళ్తే మానసిక ప్రశాంతత ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి (Pices) వారికి: ఈ రోజు భాగస్వామ్య వ్యాపారాల్లో అధికారులకు, సహచరులకు పూర్తి సహకారం లభిస్తుంది. కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. బంధువర్గం నుంచి సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. తండ్రిసాయంతో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటుంది. మీకిష్టమైనవారితో కలిసి ఉంటారు. పూర్తిగా మనస్సు నిలిచిపోయినట్లయితే ఇతరుల సాయంతో కోలుకుంటారు. వాక్చాతుర్యంతో ఇతరుల ప్రశంసలు అందుకుటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Comments