బతుకమ్మ పండుగలో రోజుకొక్కో రకమైన ప్రత్యేక నైవేద్యం...!

బతుకమ్మ పండుగలో రోజుకొక్కో రకమైన ప్రత్యేక నైవేద్యం...!



వివరణ: డాయంఎన్చార్యప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషజాతకవాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులుసునంద రాజన్ జ్యోతిషజాతకవాస్తు కేంద్రంతార్నాకహైదరాబాద్ఫోన్: 9440611151


తెలంగాణలో బతుకమ్మ పండుగకు  ప్రసిద్ధమైంది. అమావాస్య నాడు ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. బతుకమ్మ అనే మాట వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పూలునైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కోక రకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అనిచివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు.


ఈ సంవత్సరం అధిక ఆశ్వీయుజ మాసం రావడం వలన ఈ పండగను నిజ ఆశ్వీయుజ మాసం ప్రారంభంతో జరుపుకుంటారు. 16 అక్టోబర్ 2020 శుక్రవారంఅమావాస్య రోజు  ఎంగిలి పువ్వు బతుకమ్మని పేరుస్తారు. అమావాస్య నుండి 24 అక్టోబర్ శనివారం రోజు సద్దుల బతుకమ్మని "దుర్గాష్టమి" మహర్నవమిగా వేడుక చేసుకుంటారు. ఈ బతుకమ్మ పండగ ప్రాంతాల వారిగా భిన్న ఆచార వ్యవహారాలుగా కొనసాగుతుంది.


16 అక్టోబర్ 2020 శుక్రవారంఅమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మ. నువ్వులుబియ్యంపిండినూకలు కలిపి నైవేద్యంగా పెడతారు.


17 అక్టోబర్ 2020 శనివారం రోజు అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు చేస్తారు. (దేవి శరన్నవరాత్రులు ప్రారంభం)  సప్పిడి పప్పుబెల్లంఅటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.


18 అక్టోబర్ 2020 ఆదివారం రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పుపాలుబెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు.


19 అక్టోబర్ 2020 సోమవారం రోజు నానే బియ్యం బతుకమ్మ. నానేసిన బియ్యంపాలుబెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి.


20 అక్టోబర్ 2020 మంగళవారం రోజు అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.


21 అక్టోబర్ 2020 బుధవారం రోజు అలిగిన బతుకమ్మ. ఈ రోజు నైవేద్యం సమర్పించరు.


22 అక్టోబర్ 2020 గురువారం రోజు వేపకాయల బతుకమ్మ. బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు.


23 అక్టోబర్ 2020 శుక్రవారం రోజు వెన్నముద్దల బతుకమ్మ. నువ్వులువెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేస్తారు.


24 అక్టోబర్ 2020 శనివారం రోజు సద్దుల బతుకమ్మ.  ఆశ్వీయుజ అష్టమి రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. పెరుగన్నంచింతపండు పులిహోరకొబ్బరన్నంనువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి.


తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేస్తారు. మేళతాళలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగమ్మలో కలుపుతారు. పూలతో తయారు చేసిన బతుకమ్మపై పసుపుతో తయారు చేసిన గౌరవమ్మను మహిళలు తమ మంగళ సూత్రాలకు పూసుకుంటారు. దీనివల్ల తమ మాంగళ్యం అంటే తమ భర్తను ఆపదల నుంచి కాపాడి చల్లగా చూస్తుందని నమ్మకం. రొట్టెబెల్లం లేదా చక్కెర కలిపి తయారు 'మలీద'ను అందరికీ పంచితే శుభం జరుగుతుంది.


మలిద లడ్డు తయారు చేయువిధానం:


మలిద లడ్డు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి ఒక కప్పు, బెల్లం అర కప్పు, జీడి పప్పుకిసమిస్, ఏలకుల పొడి, పాలు టేబుల్ స్పూన్. నెయ్యి టేబుల్ స్పూన్, నీరు తగినంత.


లడ్డుగా తయారీ విధానం: గోధుమ పిండిని మృదువుగా కలుపుకొవాలి. చిన్ని చిన్న ఉండలను చపాతీగా వత్తుకోవాలి. వీటిని ముక్కలుగా చేసుకొని బాణలిలో వేసి సన్న మంట మీద పెట్టాలి. దాంట్లో బెల్లంజీడి పప్పుకిస్మిస్ఏలకుల పొడి అన్ని వేసి నెయ్యి వేసి బాగా కలుపుకొవాలి. వీటిని అడుగంటకుండా చూసుకోవాలి. పాలు కలుపుకుని లడ్డూలను తయారుచేసుకోవాలి.

Comments

Popular posts from this blog

హుస్సేన్ సాగర్‌లోని బుద్దుడి విగ్రహం ఠీవికి వన్నె తెచ్చే...!