తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మీ వినతి...!
- Get link
- X
- Other Apps
ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె కేవలం సినిమాల గురించే కాకుండా పలు విషయాలపై సోషల్ మీడియా ద్వారా ప్రస్తావిస్తూ ఉంటుంది.
ఆ అనుభవంతోనే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ను డిజిటల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషనలైజింగ్ గురించి అభ్యర్థించారు. పలు పాఠశాలల్లో తమ టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ తరఫున బోధనా కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఐసీటీ గురించి ప్రస్తావన వచ్చిందని అన్నారు. ఐసీటీ ట్రైనర్ల వల్ల విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం విద్యా విధానం మీద పెడుతున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా మరో మూడేళ్లలో ఆ రంగంలో గణనీయమైన మెరుగు కనిపిస్తుందని అన్నారు. ప్రాథమిక విద్యార్థుల్లో మరింత మేలిమి ఫలితాలను చూడటానికి తమ వద్దనున్న ప్రణాళికను ప్రభుత్వంతో పంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు లక్ష్మీ మంచు తెలిపారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మంచు లక్ష్మి, మోహన్ లాల్ కథానాయకుడిగా రూపొందుతోన్న మాన్‌స్టర్ మూవీలో నటిస్తుంది. ఈ సినిమా కోసం ఆమె ప్రత్యేకంగా కలరి విద్యను అభ్యసించారు. ప్రస్తుతం మాన్‌స్టర్ చిత్రీకరణ కేరళలో జరుగుతోంది.
- Get link
- X
- Other Apps
Comments