ప్రతి మహిళా తప్పని సరిగా తీసుకోవాల్సిన పోషకాహారం...!

 


ప్రతి మహిళా తప్పని సరిగా తీసుకోవాల్సిన పోషకాహారం...!

 

కొంతమంది మహిళలు పిల్లలు పుట్టిన తర్వాత తమ గురించి పట్టించుకోవడం మానేస్తారు. సరైన పోషకాహారం తీసుకుపోవడం వల్ల రకరకాలా శారీరక మానసిక మార్పులు వస్తాయి. శారీరకమైన చురుకుదనం, రోగ నిరోధక శక్తి తగ్గడం, ఒబేసిటీ వల్ల వచ్చే మధుమేహం, గుండెజబ్బులూ, కాన్సర్, మెనోపాజ్ వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వీటన్నింటి మూలంగా స్త్రీలకి ఎముకల్లో బలం తక్కువగా ఉంటుంది. అందుకని మెనోపాజ్ తరవాత ఆస్టియో పొరాసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరైన వ్యాయామం, పోషకాహారంతో జీవితకాలాన్ని పెంచవచ్చని నిపుణులు అంటున్నారు.

 

కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ని ఇచ్చే ధాన్యాలూ, పప్పులూ, పాలు, పాల పదార్ధాలూ, నట్స్, మాంసాహారం, కూరలు, పళ్ళూ ఆహారంలో భాగం చేసుకోవాలి. అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. సీజనల్గా దొరికే పళ్ళూ, కూరగాయల్ని ఎప్పుడూ మిస్ చెయ్యకూడదు. పళ్ళు, వేరుశనగపప్పూ లాంటివి తీసుకోవాలి. రాత్రి నిద్ర కు ముందే కప్పు గోరువెచ్చటి పాలలో కొంచెం పసుపు వేసుకుని తాగితే చక్కటి నిద్ర పట్టడమేకాకుండా రోగనిరోధకశక్తి కూడా బాగా పెరుగుతుంది. రోజుకి కనీసం రెండు మూడు లీటర్ల నీళ్ళు తాగాలి. కొబ్బరినీరు, మజ్జిగ, నిమ్మరసం లాంటివి కూడా మంచివే. వ్యాయామం చెయ్యడం, విటమిన్ డీ కోసం సూర్యరశ్మి సోకేటట్లు చూసుకోవడం చాలా అవసరం.

 


Comments

Popular posts from this blog

హుస్సేన్ సాగర్‌లోని బుద్దుడి విగ్రహం ఠీవికి వన్నె తెచ్చే...!