వైరల్ వీడియో

సోషల్ మీడియా అనేక వింతలకు విశేషాలకు నెలవు. ఆటవిడుపుగా, అసక్తికరంగా ఉండే ఇలాంటి వీడియోలు నెటిజనులను  విపరీతంగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఎపుడూ చూడని ఒక వింత వీడియో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఒక కప్ప మిణుగురును మింగితే.. ఎలా ఉంటుంది.. ఆ మిణుగురు పురుగు  కప్ప పొట్టలో మిణుకు మిణుకుమంటూ కనిపిస్తే ఎలాంటి ఉంటుంది. సరిగ్గా ఇలాంటి వీడియోనే ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 14 సెకన్ల వీడియోను నేచర్ ఈజ్ లిట్ ట్వీట్ చేసిన తర్వాత సంచలనంగా మారిపోయింది. 60.8 లక్షల కంటే ఎక్కువ వ్యూలు, 4.3 వేల లైక్‌లను సంపాదించింది. దీనికి మించిన యూజర్లు కమెంట్లు, పిట్ట కథలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఒక ట్విట్టర్ యూజర్ మాయ ఏంజెలో పోలుస్తూ మనలో ఉన్న వెలుగును ఎవరూ చంపలేరు అంటూ ఒకరు, బీకన్ లైటు వెలుగుతున్న విమానంలా ఉందని మరొకరు కమెంట్ చేశారు.   

Comments